Zodiac sign: ఈ రాశుల వారికి యాంగర్ మేనేజ్మెంట్ చాలా అవసరం..!
ప్రతిసారీ వారితో ప్రతికూల సమాధానమే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పుడూ కోపంగా ఉండేవారితో అసౌకర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. వారిని చూసినప్పుడల్లా వీరికి యాంగర్ మేనేజ్మెంట్ చాలా అవసరం అనిపిస్తూ ఉంటుంది.

Control Anger
ఎవరైనా నవ్వుతో పలకరిస్తే.. వారితో ఇంకాసేపు మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ.. అలా కాకుండా.. ఎప్పుడూ కోపంతో చిర్రు బుర్రులాడుతూ ఉంటే వారితో మాట్లాడాలని ఎవరికీ అనిపించదు. వామ్మో వీళ్లతో మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం కలుగుతుంది. ప్రతిసారీ వారితో ప్రతికూల సమాధానమే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పుడూ కోపంగా ఉండేవారితో అసౌకర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. వారిని చూసినప్పుడల్లా వీరికి యాంగర్ మేనేజ్మెంట్ చాలా అవసరం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి యాంగర్ మేనేజ్మెంట్ అవసరమైన రాశులు ఏంటో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
మేష రాశివారు చాలా షార్ట్ టెంపర్డ్ గా ఉంటారు. చిన్న మాటకే కోపంతో ఊగిపోతారు. అందరిపై రెచ్చిపోతూ ఉంటారు. వీరి కోపం రాకుండా ఉండాలంటే.. వారి దారిలోకే మము కూడా వెళ్లాల్సి ఉంటుంది. వీరికి ఓపిక దాదాపు జీరో అని చెప్పొచ్చు. వీరికి యాంగర్ మేనేజ్మెంట్ చాలా అవసరం.
2.కన్య రాశి..
ఈ రాశివారు కోపాన్ని అస్సలు తట్టుకోలేరు. దానిని నియంత్రించుకోవడం ఎవరి వల్ల కాదు. జీవితంలో క్లారిటీ లేకుండా.. ఏ మాట సూటిగా చెప్పలేని వారిని చూస్తే.. వీరికి విపరీతమైన కోపం వస్తుంది. అలాంటి వారు ఎదురైతే వీరు కోపాన్ని తట్టుకోలేరు. పరిశుభ్రత, లైఫ్ స్టైల్ వాంటి విషయంలోనూ... అందరూ కరెక్ట్ గా లేకపోతే.. వీరికి ఎక్కడలేని కోపం వచ్చేస్తూ ఉంటుంది.
3.సింహ రాశి..
సింహ రాశివారు దాదాపు అన్ని విషయాల్లో కంట్రోల్డ్ గానే ఉంటారు. కానీ.. తాము చెప్పింది జరగదు అని తెలిస్తే మాత్రం.. వీరి కోపాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. తాము కోరుకున్నది జరగకపోతే కోపంతో ఊగిపోతారు. ఇతరులు చెప్పేది కూడా వీరు వినాలని అనుకోరు.
4.మిథున రాశి..
ఈ రాశివారు కొద్దిగా టెన్షన్ వస్తే చాలు ట్రిగర్ అయిపోతారు. ఆందోళనను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక.. అనవసరంగా కోపం తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఎవరు వారి కోపాన్ని కంట్రోల్ చేయాలి అని చూసినా అస్సలు ఆగరు. అల్లకల్లోలం సృష్టిస్తారు.
5.కర్కాటక రాశి
కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. వారి భావోద్వేగాలు తరచుగా ఓవర్‌డ్రైవ్ మోడ్‌లోకి వెళ్తాయి, అది వారిని ఆందోళనకు గురిచేస్తుంది. వారు కోపంగా ఉన్నప్పుడు.. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఆ మాటలు ఎదుటివారిని బాధ పెడతాయి అని కూడా ఆలోచించరు.
6.తుల రాశి..
తులారాశివారు తమ జీవితాల్లో సమతుల్యతను కోరుకునే చాలా సులభమైన వ్యక్తులుగా కనిపిస్తారు. అయితే, వారు అన్యాయాన్ని సహించలేరు. ఎదుటి వారికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోలేరు. ఆ సమయంలో వీరు చాలా కోపంతో ఊగిపోతారు.