Zodiac sign: ఈ రాశులవారు తమ నిజాలు బయటపెట్టరు..!
కొందరు కనీసం తమతో ఉన్నవారితో నైనా కొన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. కానీ.. కొందరు మాత్రం... తమ గురించి చాలా నిజాలు కూడా బయటపెట్టరు.

ప్రతి ఒక్కరికీ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అయితే.. కొందరు సీక్రెట్స్ ని అస్సలు బయటపెట్టరు. కానీ కొందరు కనీసం తమతో ఉన్నవారితో నైనా కొన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. కానీ.. కొందరు మాత్రం... తమ గురించి చాలా నిజాలు కూడా బయటపెట్టరు. లోపలే దాచిపెట్టుకుంటారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
1.మేష రాశి...
ఈ రాశివారు తమ లైఫ్ ని కంట్రోల్ లో ఉంచుకుంటారు. వారికి లైఫ్ లో ఏం చేయాలి.. ఏం చేయకూడదూ అనే క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వీరి గురించి ఎవరికీ తెలియజేయనివ్వరు. తమ గురించి ఎవరికీ విషయాలు బయటకు రానివ్వరు.
2.వృషభ రాశి...
ఈ రాశివారు.. తమ గుండెలో ఏముంది అనే విషయం అస్సలు బయటపెట్టరు. ఈ రాశివారు.. తమ బాధను తమలోనే దాచుకుంటారు. తమ బాధను ఎవరికీ బయటపెట్టరు. బాధ ను బయటపెట్టకుండా.. బయటకు మాత్రం నవ్వుతూ ఉంటారు.
3.మిథున రాశి..
ఈ రాశివారు తమ గుండె రెండు ముక్కలు అయినా కూడా... ఈ విషయం బయట పెట్టరు. తమలో తమ మనసులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని వీరు అస్సలు బయటపెట్టరు.
4.కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారు కొంచెం ఎదుటివారికి హాని చేసే స్వభావం కలిగే ఉంటారు. కానీ.. వారు చాలా విషయాలు..తమ గురించి అస్సలు బయటపెట్టరు. బయటకు వారి మాత్రం చాలా టఫ్ గా కనిపిస్తారు.
5.సింహ రాశి..
ఈ రాశివారికి అభద్రతా భావం చాలా ఎక్కువ. కానీ.. ఈ విషయాన్ని అస్సలు బయటపెట్టరు. బయటకు మాత్రం.. అందరి ముందూ కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. ఈ రాశివారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాన్ని కూడా ఎదుటివారు కనీసం ఊహించలేరు.
6.కన్య రాశి...
కన్య రాశివారు.. తమ ఫీలింగ్స్ ని అస్సలు బయటపెట్టరు. తమ ఫీలింగ్స్ ని బయటపెడితే... తమను అందరూ అసహ్యించుకుంటారని వీరు అనుకుంటూ ఉంటారు. వీరు.. తమను ఎవరైనా రిజెక్ట్ చేస్తే తట్టుకోలేరు. తమ గురించి తెలిస్తే.. అందరూ రిజెక్ట్ చేస్తారనే భయంతో ఫీలింగ్స్ ని బయటపెట్టరు.
7.తుల రాశి...
ఎవరైనా తమను బాధపెట్టినప్పుడు.. వీరికి విపరీతమైన కోపం వస్తుంది. కానీ.. ఆ ఎమోషన్ ని వీరు అస్సలు బయపెట్టరు. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం గురించి వారు ఆలోచించరు. కానీ.. తమ ఎమోషన్ ని మాత్ర కంట్రోల్ చేసుకుంటారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి ఇతరుల పట్ల కాస్త అసూయ ఎక్కువ. అయితే... ఈ విషయాన్ని మాత్రం అస్సలు బయటపడనివ్వరు. తమకు అసలు ఎదుటివారి పట్ల అస్సలు అసూయ లేదు అన్నట్లుగా నటిస్తూ ఉంటారు.
9.ధనస్సు రాశి...
ఈ రాశివారికి మామూలుగా కోపం రాదు. కానీ.. ఏదైనా పరిస్థితుల్లో తమను నిలపెట్టినప్పుడు.. కోపం వచ్చినట్లు నటిస్తూ.. ఎదుటివారిని బయటపెట్టాలని చూస్తారు.
10.మకర రాశి...
ఈ రాశి వారికి నెగిటివ్ ఎమోషన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ.. ఆ విషయాన్ని బయట పడనివ్వరు. తమలోని నెగిటివిటీని లోపలే దాచుకొని.. బయటకు మాత్రం పాజిటివీటిన స్ప్రెడ్ చేస్తూ ఉంటారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారు అందరినీ ప్రేమించలేరు. కొందరిపై ద్వేషం పెంచుకుంటారు. ఆ వ్యక్తితో వీరు రోజూ మాట్లాడతారు. కానీ.. తమలో ఉన్న ద్వేషాన్ని మాత్రం బయటపెట్టరు. బయటకు చూపించరు.
12.మీన రాశి..
ఈ రాశివారికి కాస్త అత్యాశ ఎక్కువ. అయితే.. తమలో ఉన్న అత్యాశను వీరు గదిలోపలే వదిలేస్తారు. బయటకు రానివ్వరు. తమకు ఎలాంటి అత్యాశ లేనట్లుగానే ప్రవర్తిస్తారు. చాలా దయగల వారిలా ప్రవర్తిస్తారు.