Zodiac sign: ఈ రాశులవారికి అసూయ కాస్త ఎక్కువే..!
అసూయతో ఇతరులను నాశనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఆ అసూయతో తమలో తాము సమస్యలు తెచ్చుకునేవారు కూడా కొందరు ఉంటారు.

jealous
మనిషి అన్నాక కాస్తూ కూస్తో స్వార్థం ఉంటుంది. పూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా.. నిస్వార్థంగా ఉండేవారు చాలా తక్కువ అనే చెప్పాలి. స్వార్థం ఉన్నా పర్వాలేదు కానీ.. ఇతరులను చూసి అసూయ మాత్ర పడకూడదు. ఇది అన్నింటికన్నా చాలా ప్రమాదం. మన ఎదురుగా.. ఎవరైనా ఎదుగుతుంటే వారు చూసి తట్టుకోలేరు. వారు ఆ అసూయతో ఇతరులను నాశనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఆ అసూయతో తమలో తాము సమస్యలు తెచ్చుకునేవారు కూడా కొందరు ఉంటారు. అందుకే.. ఈ రకం మనుషులకు అందరూ దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. మరి తమలో అసూయ పెంచుకొని రగిలిపోయే రాశులేంటో ఓసారి చూద్దాం...
1.వృషభ రాశి...
ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ఎక్కువగా విందు, వినోదాల్లో పాల్గొనాలని అనుకుంటూ ఉంటారు. అయితే... తమ కష్టానికి మరొకరు ఫలితం పొందారు అని తెలిస్తే మాత్రం వీరు తట్టుకోలేరు. అసూయతో రగిలిపోతారు. వీరు బాగా కష్టపడతారు. కానీ.. మనసులో మాత్రం అసూయతో రగిలిపోతారు. ఒక్కసారి వీరికి అసూయ కలిగింది అంటే... ఎవరినైనా నాశనం చేయగలరు.
2.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు చాలా సున్నితంగా ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. తమ స్నేహితులు, బంధువుల కోసం తమను తాము అంకితమిస్తారు. అయితే.. తమ స్థానంలోకి మరొకరు రావాలని ప్రయత్నిస్తే మాత్రం వీరు అసూయతో రగిలిపోతారు. తమలో తాము చాలా అసురక్షితంగా భావిస్తారు. చాలా సున్నితంగా తమ స్థానంలోకి వచ్చిన వ్యక్తిని నాశనం చేస్తారు.
3.సింహ రాశి..
సింహ రాశివారికి అసూయ చాలా ఎక్కువ. ఎవరినైనా చూసి వీరు అసూయపడినప్పుడు చాలా కోపంగా ఫీలౌతారు. అందరూ తమనే అనుసరించాలని వీరు అనుకుంటూ ఉంటారు. అన్నింట్లోనూ తామే ఫస్ట్ ఉండాలని వీరు ఫీలౌతూ ఉంటారు. వీరికి అహం కూడా కాస్త ఎక్కువే. తాము చేసిన తప్పులను వారు అంగీకరించరు.
4.కన్య రాశి..
తమ కలల జీవితాన్ని మరొకరు గడుపుతున్నట్లు చూస్తే, వారు చాలా అసూయపడతారు. వారిని నాశనం చేయాలని అనుకుంటారు. సదరు వ్యక్తి జీవితాన్ని, స్థానాన్ని ఏ విధంగానైనా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు, తద్వారా వారు కలలుగన్నట్లుగా పరిపూర్ణ జీవితం, సంబంధం మరియు వృత్తిని కలిగి ఉంటారు.
5.వృశ్చక రాశి..
ఈ రాశివారికి కూడా అసూయ కాస్త ఎక్కువే. వీరు ఎదుటివారి చెడు గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వీరు అందరిలోకీ తామే శక్తివంతులుగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అది జరగని పట్ల.. వీరు అసూయతో రగిలిపోతారు. అసవరమైతే ఇతరులను నాశనం చేసేదాక కూడా వీరు ఊరుకోరు. అదే లక్ష్యంగా పెట్టుకుంటారు.
మేషం, మిథున రాశి, తుల రాశి , ధనుస్సు రాశి, మకర రాశి, కుంభ రాశి, మీన రాశి వారు పూర్తి అవగాహన కలిగి ఉంటాయి. వారు సులభంగా అసూయపడరు.