ఈ రాశులవారు విమర్శలను తట్టుకోలేరు..!
కొందరు మాత్రం ఎదుటివారు తమను చేసే విమర్శలను అస్సలు భరించలేరు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చు. ఈ కింద రాశుల వారు ఎదుటివారు చేసే విమర్శలను అస్సలు తట్టుకోలేరు,

criticise
మనం ఏం చేసినా.. ఎక్కడైనా ఒకరో ఇద్దరో విమర్శించేవారు ఉంటారు. కొందరి విమర్శలు మనకు మంచి చేస్తాయి.. మరి కొందరి విమర్శలు మనల్ని బాధిస్తాయి. కొందరు.. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా తట్టుకుంటారు. కానీ.. కొందరు మాత్రం ఎదుటివారు తమను చేసే విమర్శలను అస్సలు భరించలేరు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తించవచ్చు. ఈ కింద రాశుల వారు ఎదుటివారు చేసే విమర్శలను అస్సలు తట్టుకోలేరు,
కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. అందుకే ఏవరైనా వారిని విమర్శిస్తే వెంటనే ఏడ్చేస్తారు. లేదంటే బాధతో ఇంకోసారి తమను విమర్శించిన వ్యక్తితో మాట్లాడరు. లేదంటే.. తమను విమర్శించిన వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. దాని వల్ల వారితో రిలేషన్ చెడిపోతుంది.
కన్య రాశి..
ఈ రాశివారు తమను తాము చాలా కంప్లీట్ వ్యక్తిగా ఫీలౌతుంటారు. అంతేకాదు.. తమను తాము చాలా తెలివైన వ్యక్తులుగా భావిస్తుంటారు. తమలో ఎలాంటి లోపాలు లేవని అనుకుంటూ ఉంటారు. ఇక ఎవరైనా తమలో ఏవైనా లోపాలు ఉన్నాయని చెప్పినా.. లేక విమర్శించినా.. వీరు భరించలేరు. వారిని తిట్టడం లాంటివి చేసి ఆ కోపాన్ని తీర్చుకుంటారు.
3.తుల రాశి..
ఈ రాశివారు అన్ని పనులను ది బెస్ట్ గా చేస్తారు. అయినా కూడా తమ పనిని ఎవరైనా విమర్శిస్తే... వీరు చాలా అవమానకరంగా ఫీలౌతూ ఉంటారు. అయితే.. తమను విమర్శించిన వారతో గొడవ పడటం, వాదనలకు దిగడం లాంటివి చేయరు. అలా విమర్శించేవారికి దూరంగా ఉంటారు. తమను విమర్శించేవారు మళ్లీ శాంతియుతంగా మారేవరకు వారితో మాట్లాడరు.
4.ధనస్సు రాశి..
తాము చేసిన పనిలో ఎవరైనా తప్పులు ఎత్తడం లాంటివి చేయడం లేదా.. తమకు ఎవరైనా సహాయం చేయడానికి వచ్చినా.. వీరికి నచ్చదు. చాలా చిరాకుగా ఫీలౌతారు. తమను విమర్శించేవారిని అసహ్యించుుకుంటారు. వారిపై ద్వేషం పెంచుకుంటారు. తమ తప్పులను ఎవరైనా ఎత్తి చూపడం వీరికి నచ్చదు. అదే ముఖం మీద చెప్పేస్తారు.
5మీన రాశి..
వారు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకుంటారు. కాబట్టి వారిని బహిరంగంగా విమర్శించడం అంటే వారిని అందరి ముందు తక్కువ చేసినట్లుగా ఫీలౌతారు.. వారు చాలా సున్నితంగా ఉంటారు. విమర్శల పట్ల వారు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు, అయినప్పటికీ వారి ఆటను మెరుగుపరచడంలో వారికి సహాయపడతారు.