Zodiac sign: ఈ రాశులవారు తమ భాగస్వామికి అబద్దాలు మాత్రమే చెబుతారు..!
చెడు ఉద్దేశ్యంతో చెప్పే అబద్ధానికి, మంచి ఉద్దేశ్యంతో చెప్పే అబద్ధానికి చాలా తేడా ఉంది. అయితే అబద్ధం ఏ కారణం చేతనైనా ఆడకూడదనే జ్ఞానం ఉండాలి.

కొందరికి అబద్దం అపాయం నుంచి తప్పించే ఓ మార్గం. కొందరికి అబద్దం చెప్పడం అవసరం. మరి కొందరికి మాత్రం.. అబద్దం చెప్పడం అలవాటు. ఈ అబద్దాలు చెప్పేవారు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఇతరులను సంతోషంగా ఉంచేందుకు కొందరు అబద్దాలు చెప్పవచ్చు. కొందరేమో.. తమ గురించి గొప్పలు చెప్పుకునేందుకు అబద్దాలు చెబుతూ ఉండొచ్చు.. దీన్ని మన భాషలో బడాయి అని కూడా అంటారు. ఇది శ్రోతలకు విసుగును కలిగించవచ్చు లేదా మరేదైనా విపత్తుకు దారితీయవచ్చు.
కొందరేమో.. ఇతరుల గురించి అబద్ధాలు చెబుతారు. దీని వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెడు ఉద్దేశ్యంతో చెప్పే అబద్ధానికి, మంచి ఉద్దేశ్యంతో చెప్పే అబద్ధానికి చాలా తేడా ఉంది. అయితే అబద్ధం ఏ కారణం చేతనైనా ఆడకూడదనే జ్ఞానం ఉండాలి. ఈ సంగతి పక్కన పెడితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు.. తమ జీవిత భాగస్వామికి తరచూ అబద్దాలు చెబుతూనే ఉంటారట. నిజానికి రిలేషన్ లో ఉండాల్సింది నమ్మకమే.
అబద్ధంతో నమ్మకానికి పునాది వేయదు. భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం ఉండాలంటే అబద్ధపు ఛాయలు ఉండకూడదు. కానీ, కొందరు వ్యక్తులు ఉన్నారు. తమ భాగస్వామికి అబద్ధాలు చెబుతుంటారు. అయితే.. వారి అబద్దం ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ.. సమయానికి తగినట్లుగా అబద్దాలు చెబుతూ ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
• వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు తొందరగా తమ మనసులో మాట బయటపెట్టరు. వారు కార్యాలయంలో తమను తాము భిన్నంగా ప్రదర్శిస్తారు. వీరు తొందరగా ఎక్కువ మందితో కలవలేరు. ఎక్కువ సమయం సోషల్ మీడియా లో స్క్రోల్ చేస్తారు. దీనికి జీవిత భాగస్వామి అభ్యంతరం చెబితే ఆఫీసు పని అని అబద్ధం చెప్పవచ్చు. వారు తమ ఫోన్ స్క్రీన్‌ను చూస్తూ గంటలు గడపవచ్చు.
• వృషభ రాశి..
ఇతరుల సాంగత్యాన్ని ఇష్టపడతారు కానీ కొన్నిసార్లు వారు తమతో తాము ఒంటరిగదా గడపాలని కోరుకుంటారు. వారు వీడియో గేమ్‌లు ఆడుతూ లేదా స్నూజ్ చేస్తూ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామి నుంచి ``ఎలా టైమ్ పాస్ చేశావు?'' అనే ప్రశ్న వస్తే అబద్ధం చెబుతాడు. వారు తమ భాగస్వామిని కలవరపెట్టడానికి ఇష్టపడరు. ఈ క్రమంలో అబద్దం చెబుతారు.
• సింహరాశి
బద్ధకంగా సమయం గడపడానికి ఇష్టపడతాడు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడం వారికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఇంటి పనుల విషయంలో బద్ధకంగా ఉంటాడు. వారు పనిలో అలసిపోయినట్లు నటిస్తారు. వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో వారిని నిద్ర లేపడం , పని చేయిచడం కష్టం. అతను ఇంటిపనులు చేస్తూ విసుగు చెంది తన భాగస్వామికి సులభంగా అబద్ధాలు చెబుతాడు. వారు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తారు. దీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవడమే దీని వెనుక ఉద్దేశం.