Bedroom Vastu: మీ బెడ్‌రూమ్, బాత్రూమ్ మురికిగా ఉంటే ఈ గ్రహాలకు కోపం వస్తుంది
Bedroom Vastu: ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నడయాడుతుందని చెబుతారు. అయితే ఇంటిలోని ప్రతి భాగం ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా బెడ్ రూమ్, బాత్రూం పరిశుభ్రంగా ఉంచుకోపోతే కొన్ని గ్రహాలకు కోపం వస్తుంది.

ఒక్కో గ్రహంతో ఒక్కో గదికి బంధం
సనాతన హిందూ ధర్మంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది కచ్చితంగా చేయాల్సిన పని. జ్యోతిష శాస్త్రం, వాస్తు ప్రకారం లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఆ ఇల్లు పరిశుభ్రంగా కళకళలాడుతూ ఉండాలి. ఇంటి శుభ్రత అనేది ఆ ఇంట్లోని వారి ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇంటిని కచ్చితంగా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ఇంటిలోని ప్రతిభాగం ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్, బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఏ గ్రహాలకు కోపం వస్తుందో.. ఆ గ్రహాల వల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసుకోండి.
బెడ్ రూమ్ పరిశుభ్రంగా లేకపోతే
బెడ్ రూమ్‌లో పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనకి కంటి నిండా నిద్ర పడుతుంది. ముఖ్యంగా మనస్సు, భావోద్వేగాలు, వైవాహిక జీవితం, మానసిక ప్రశాంతత అంతా బెడ్ రూమ్ ఉండే తీరుపైనే ఆధారపడి ఉంటుంది. బెడ్ రూమ్‌ను చంద్రుడు, శుక్రుడు, రాహువులతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. బెడ్ రూమ్ పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఈ గ్రహాలకు కోపం వస్తుంది. చంద్రుడు భావోద్వేగాలు, నిద్ర, మానసిక ప్రశాంతత, భావోద్వేగ స్థిరత్వం వంటివన్నీ చెడిపోయేలా చేస్తాడు. ఇక శుక్ర గ్రహం ప్రేమ, అందం, విలాసాలకు అధిపతి. ఎప్పుడైతే బెడ్ రూమ్ పరిశుభ్రంగా ఉండదో శుక్రుడి కోపానికి గురవ్వాల్సి వస్తుంది.ఇక రాహువు ప్రతికూల ప్రభావాలు కూడా పెరిగిపోతాయి. ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. గందరగోళమైన జీవితం మొదలైపోతుంది. నిద్రలేమి, ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి బెడ్ రూమును పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
బాత్రూమ్ పరిశుభ్రంగా లేకపోతే
వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూమ్ ముఖ్యమైన గది. ఇది శక్తివంతమైన ప్రదేశం కూడా. ఎందుకంటే ఇంట్లోనే ప్రతికూల శక్తి పేరుకుపోయేది. బాత్రూమ్ దగ్గరే కాబట్టి దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గదితో కేతువు, కుజ గ్రహాలకు అనుబంధం ఉంటుంది. బాత్రూం మురికిగా ఉంటే శని వల్ల కలిగే చెడు ప్రభావాలు పెరిగిపోతాయి. అడ్డంకులు, మానసిక ఒత్తిడి, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాహుకేతువులు కూడా తీవ్ర ప్రభావం చెందుతారు. దీని వల్ల లైంగిక వ్యాధులు, చర్మవ్యాధులు, మానసిక సమస్యలు వస్తాయి. బాత్రూం మురికిగా ఉంటే మంగళ దోషం కూడా రావచ్చు. కాబట్టి బాత్రూంను ఎల్లప్పుడూ శుభ్రంగా పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా శాంతిగా ఉంటాయి.
ప్రతి రోజూ ఇలా చేయండి
ప్రతిరోజు బెడ్ రూమ్ ను పరిశుభ్రంగా తుడుచుకొని, బెడ్ షీట్లు మడతబెట్టి ఎక్కడవి అక్కడ సర్దుకోవాలి. అలాగే బెడ్ రూమ్ లోకి కాంతి వచ్చేలా చూసుకోవాలి. మంచి సువాసన వచ్చేలా జాగ్రత్త పడాలి. అప్పుడు చంద్రుడు, శుక్రుడు బలంగా మారుతాడు. అలాగే బాత్రూంలో కూడా క్రమం తప్పకుండా శుభ్రంగా చేస్తూ ఉండాలి. వేప, కర్పూరం కలిపిన నీటిని బాత్రూంలో ఉంచితే మంచిది. ఇది శని, కేతువులను కూడా శాంతింప చేస్తుంది.

