వాస్తుప్రకారం.. ఈ పూలు ఒత్తిడిని తగ్గిస్తాయి..!
భారతీయ ఆయుర్వేదంలో చాలా కాలం క్రితం వివిధ పుష్పాలను ఉపయోగించారు. కొన్ని రకాల పువ్వులు వ్యాధులను నయం చేయగలవని చెబుతారు.

<p>winter garden</p>
పువ్వులు ప్రపంచంలో ఒక అందమైన సృష్టి. నిజానికి పూల పేరు తలుచుకుంటే చాలు.. మనసుకి ఏదో ప్రశాంతత.. ఉల్లాసం గా అనిపిస్తూ ఉంటుంది. పూలు మన జీవితాలను సువాసనగా మార్చడమే కాకుండా వాస్తు దోషాలను నివారించే శక్తి పువ్వులకు ఉందని మీకు తెలుసా?
భారతీయ ఆయుర్వేదంలో చాలా కాలం క్రితం వివిధ పుష్పాలను ఉపయోగించారు. కొన్ని రకాల పువ్వులు వ్యాధులను నయం చేయగలవని చెబుతారు. పువ్వులు మన జీవితంలో అంతర్భాగంగా మారినా.. వీటిని పోషకాహారం, ఔషధ వినియోగం కోసం కూడా ఉపయోగిస్తారు.
చెట్టు, వృక్షజాలం, పువ్వులు మన జీవితాలను సువాసనగా మార్చడమే కాకుండా వాస్తు దోషాన్ని నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఇంట్లో పూలు ఉంటే వాటిని చూడటం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పువ్వులు శక్తిని తెలియజేస్తాయి, వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి, జీవితానికి ఆనందాన్ని అందిస్తాయి, అలాంటి సంతోషకరమైన, ఓదార్పునిచ్చే పువ్వులు ఏమిటో తెలుసుకుందాం.
Jasmin Flower
గుండ్రటి మల్లె
మల్లెపూలను ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో. కాగా గుండ్రటి మల్లెపూలు ఇంటి ఆవరణలో వికసిస్తే ఆ ఇంటిలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంటి ప్రాంగణంలో దాని ఉనికి మీ ఆలోచనలు, భావాలలో సానుకూల మార్పులను కలిగిస్తుంది.
పారిజాత
పారిజాత పువ్వులు ఉన్న ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. పారిజాత పువ్వులను హెర్సింగర్ అని కూడా పిలుస్తారు. ఈ మెరిసే పువ్వులు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి. ఉదయం వాటంతట అవే రాలిపోతాయి. ఆయుర్వేదం ప్రకారం, దీని పువ్వులు ఒత్తిడి నియంత్రణ సామర్థ్యాన్ని, అనేక దివ్యమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి.
సంపంగి పువ్వు
చంపా లేదా సంపంగి పువ్వులు కూడా పూజకు ఉపయోగపడతాయి. వాతావరణాన్ని శుద్ధి చేసేందుకు ఈ మొక్కలు ఉపయోగపడగా.. చంపా పువ్వులు అనేక వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది ఇంట్లో ఉంటే.. ఆ ఇంట్లో ఆనంద వెల్లివిరుస్తుంది.
రెక్కమల్లె..
వేసవిలో మల్లెపూలు పూస్తాయి. దీని సువాసన మన శరీరానికి , మనసుకు చల్లని అనుభూతిని ఇస్తుంది. మల్లెపూల సువాసన మనస్సును ఉల్లాసపరుస్తుంది. కోపాన్ని శాంతపరుస్తుంది. మొత్తం మీద మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
గులాబీ
గులాబీలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఈ పువ్వులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గులాబీల సువాసన మనస్సును శాంతపరచడమే కాకుండా, ఒత్తిడిని దూరం చేస్తుంది. బంధంలో మధురతను కాపాడుతుంది.