Dreams: కలలో ఇవి కనిపిస్తే.. మంచి ఉద్యోగం, ప్రమోషన్ గ్యారంటీ!
నిద్రలో కలలు రావడం సహజం. అయితే కొన్ని కలలు మనం ఆనందించేలా ఉంటాయి. మరికొన్ని భయపడేలా ఉంటాయి. ఎలాంటి కల వచ్చినా దాని వెనక ఓ కారణం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు వస్తే.. త్వరలోనే మీకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం లభిస్తుందని అర్థమట. మరి ఆ కలలెంటో ఓసారి చూద్దామా..

కలలు కనని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అందరికీ కలలు వస్తుంటాయి. కానీ మనం కనే ప్రతి కల.. మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని మీకు తెలుసా? ఏ కల వస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
పోటీలో గెలిచినట్లు..
స్వప్న శాస్త్రం ప్రకారం కొందరికీ పోటీల్లో గెలిచినట్లు పదే పదే కలలు వస్తుంటాయి. ఒకవేళ మీ కలలో మీరు పోటీలో గెలిచినట్లు వస్తే.. మీరు జీవితంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారని అర్థం.
స్వస్తిక్ గుర్తు..
స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో స్వస్తిక్ లేదా ఓం గుర్తులు కనిపిస్తే.. త్వరలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందని అర్థం.
జంతువులు కనిపిస్తే..
సాధారణంగా కలలో కొందరికి జంతువులు కనిపిస్తుంటాయి. మీ కలలో తెల్ల గుర్రం లేదా తెల్ల ఎద్దు కనిపిస్తే.. మీ ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
పూలు కనిపిస్తే..
మీ కలలో పూలు వికసిస్తున్నట్లు చూస్తే.. మీ ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అందులో మంచి ఉద్యోగం లేదా ప్రమోషన్ కూడా ఉండవచ్చు.
కిరీటం కనిపిస్తే..
మీ కలలో సన్యాసులు, మహాత్ములు లేదా కిరీటం, రాజు దుస్తులు వేసుకున్నట్లు కనిపిస్తే.. మీకు శుభ ఫలితాలు వస్తాయి. జీతం పెరుగుదల, ఉన్నత హోదా పొందే అవకాశం ఉంటుంది.