Birth Stars:ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు... భార్యను మహారాణిలా చూసుకుంటారు
Birth Stars: జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు.. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయిని మహారాణిలా చూసుకుంటారు. తల్లిదండ్రులను మించిన ప్రేమను కురిపించగలరు.

Birth Stars
మన భారతీయ సంస్కృతిలో జాతకం, రాశి, నక్షత్రం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వ్యక్తి ప్రవర్తనా, ఆలోచనా విధానం, కుటుంబం పట్ల బాధ్యత, భార్యపై చూపించే ప్రేమ అన్నీ వ్యక్తి జన్మ నక్షత్రంతో కొంత వరకు సంబంధం ఉంటాయని జోతిష్యం చెబుతోంది. ముఖ్యంగా పురుషులు వివాహ జీవితంలో ఎలా ఉంటారు? భార్యను ఎంతగానో ప్రేమించే , గౌరవించే లక్షణం వారికి ఉందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
రోహిణీ నక్షత్రం...
రోహిణీ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారి వ్యక్తిత్వం కూడా చాలా శాంతంగా ఉంటుంది. వీరు తమ భార్య భావాలు, ఆలోచనలను బాగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపుతారు. ప్రతి నిమిషం భార్య ఆనందం కోసమే ఆలోచిస్తారు. ఇంట్లో గొడవలు లేకుండా.. సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ నక్షత్రం కింద పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు తమను తాము మహారాణిలా ఫీలౌతారు.
అనురాధ నక్షత్రం...
అనురాధ నక్షత్రంలో పుట్టిన పురుషులు కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. భార్యకు గౌరవం, ప్రేమ, రక్షణ ఇవ్వడం తమ బాధ్యతగా భావిస్తారు. వివాహానంతరం వారి ఫస్ట్ ప్రయారిటీ భార్యే అవుతుంది. ఆమె కష్టాల్లో, అనారోగ్యంలో, నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటారు. వీరి సపోర్ట్ కారణంగా... భార్య ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.
ఉత్తర ఫాల్గుని నక్షత్రం..
ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా శాంతంగా ఉంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. వివాహ బంధాన్ని పవిత్రంగా చూసే ఇలాంటి అబ్బాయిలు భార్య ఆత్మ గౌరవాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు. ఆమె కోరికలు, లక్ష్యాలు నెరవేర్చడంలో వీరు ముందుంటారు. ప్రతి విషయంలో భార్యకు అండగా నిలుస్తారు. ఇలా ఉంటే భార్య నిజంగానే రాజకుమారిలా ఫీలౌతుంది.
పునర్వసు నక్షత్రం...
పునర్వసు నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు కూడా చాలా శాంతంగా ఉంటారు. వీరి మనసు వెన్న. వీరికి కోపం చాలా అరుదుగా వస్తుంది. భార్య చేసిన తప్పులకు కూడా సులభంగా క్షమించే మనస్తత్వం కలిగి ఉంటారు. ఎలాంటి భార్య జీవితంలోకి వచ్చినా వీరు ప్రేమగా చూసుకుంటారు.
5.హస్త నక్షత్రం....
హస్త నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా జ్ఞానవంతులు, క్రమశిక్షణ గలవారు. తమ భార్యను జీవిత భాగస్వామి మాత్రమే కాదు, జీవిత విజయానికి మూలస్థంభంగా భావిస్తారు. ఆమె రక్షణకు, అభివృద్ధికి అండగా నిలుస్తారు. భార్య కోరింది తెచ్చి పెట్టడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు.
ఫైనల్ గా....
ప్రతి నక్షత్రానికి తనకంటూ ప్రత్యేక గుణాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం పై నక్షత్రాల్లో జన్మించిన పురుషులు భార్యను ప్రేమ, గౌరవం, రక్షణతో చూసుకుంటారు. అయితే ఒక్క నక్షత్రమే కాకుండా, వ్యక్తిగత స్వభావం, పెరిగిన వాతావరణం, విలువలు కూడా వివాహ జీవితంపై ప్రభావం చూపుతాయి. అయినా సరే, ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు భార్యను నిజంగా మహారాణిలా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని జ్యోతిష్యం సూచిస్తుంది.