Zodiac signs: మీ కష్టం పగ వాడికి కూడా రాకూడదు.. 2026లో పాపం ఈ రాశులు..!
Zodiac signs: మరో 20 రోజుల్లో మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త సంవత్సరం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. కానీ, కొన్ని రాశుల వారికి మాత్రం చాలా కష్టాలు రానున్నాయి.

2026 Zodiac signs
2026 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం అనగానే చాలా మందికి ఎన్నోన్నె ఆశలు ఉంటాయి. అంతేకాదు.. ఈ ఏడాది మొత్తం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. అయితే... 2026లో కొన్ని రాశులకు గ్రహాలు ఏ మాత్రం సహకరించడం లేదు. ఏది మొదలుపెట్టినా నష్టాలే వచ్చే అవకాశం ఉంది. మరి, 2026లో అత్యంత ఎక్కువ కష్టాలు ఎదుర్కునే ఐదు రాశులేంటో చూద్దాం....
1.మేష రాశి.....
2026 నూతన సంవత్సరంలో మేష రాశివారికి ఏలినాటి శని మొదటి దశ మొదలౌతుంది. కాబట్టి, ఈ కాలంలో మేష రాశివారికి ఆందోళనలు, భయాలు చాలా పెరుగుతాయి. ఈ కాలంలో, మేష రాశివారి ఆదాయాన్ని పెరిగే మార్గాలు అనేక అడ్డంకులు రావచ్చు. శత్రువులు పెరుగుతారు. శత్రువుల కారణంగా చాలా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆందోళనలు, భయాల కారణంగా... చాలా ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎంత ఆదాయం వచ్చినా.. ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఏ పని మొదలుపెట్టినా... ఆ పని పూర్తిగా ఆలస్యం అవుతాయి.
2.కుంభ రాశి....
2026లో కుంభ రాశి వారు ఏలినాటి శని చివరి దశలో ఉంటారు. ఈ కాలంలో, కుంభ రాశివారి పరిస్థితి దారుణంగా పడిపోవడానికి కొత్తగా ఏమీ లేదు. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరు చాలా కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ, ఈ ఏడాది కూడా కొన్ని సమస్యలు వీరికి వచ్చే అవకాశం ఉంది. వీరికి పనిలో ఆటంకాలు ఏర్పడొచ్చు. ఈ అడ్డంకులు వీరిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ, జాగ్రత్తగా ఉండటం మంచిది. మరీ, ముఖ్యంగా ఈ రాశివారు వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈ ఏడాది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
3.మీన రాశి....
2026లో మీన రాశివారు ఏలినాటి శని రెండో దశలో ఉంటారు. అందుకే, ఈ సమయంలో ఈ రాశివారికి ఊహించని సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఖర్చులు అధికంగా పెరుగుతాయి. పనులు ఆలస్యం అవుతాయి.
4.ధనుస్సు రాశి...
2026 లో ధనుస్సు రాశి పై శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు.దీని వల్ల కాస్త మనశ్శాంతి పొందుతారు. ఈ ఏడాది మొత్తం ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
5.సింహ రాశి....
సింహ రాశిలో జన్మించిన వారికి 2026లో పెద్దగా కలిసొచ్చేది ఏమీ లేదు. వీరికి ఈ సమయంలో అన్ని పనుల్లోనూ అడ్డంకులు ఏర్పడతాయి. ఒత్తిడితో పాటు.. బాధలు కూడా పెరుగుతాయి. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నామనే భావనలోనే జీవిస్తారు. ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో బాధ్యతారహితంగా ఉంటారు. ఎంత కష్టపడినా ఆదాయం తగ్గిపోతుంది. చేతికి వచ్చిన ఆదాయం మొత్తం... ఖర్చు అయిపోతాయి. కెరీర్ పరంగానూ చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

