Zodiac Signs: ఈ 4 రాశుల వారు ఓటమిని తట్టుకోలేరు, ఓడిపోవడమంటేనే భయం
Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఓటమి అంటేనే భయం. ఓడిపోతే ఏమాత్రం తట్టుకోలేరు. ఓటమి వల్ల వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

ఓటమి అంటే భయపడే రాశులు
జ్యోతిషశాస్త్రంలో పన్నెండు రాశులు ఉన్నాయి. ఒక్కో రాశి వారికి ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి ఓటమిని తట్టుకోలేరు. ఓటమిని తేలికగా తీసుకోలేరు. ఓటమికి భయపడే రాశులు ఏవో తెలుసుకోండి.
మేష రాశి
మేషరాశి వారు చిన్నప్పట్నించి పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ తామే మొదటి స్థానంలో నిలవాలని కోరుకుంటారు. గెలవాలని ప్రయత్నిస్తారు. ఓటమి ఎదురైతే తట్టుకోలేరు. ఓటమిని అంగీకరించలేరు. తీవ్ర నిరాశకు గురవుతారు.
సింహరాశి
సింహరాశి వారి ఆత్మ గౌరవం ఎక్కువ. వీరు ఎప్పుడూ విజేతలుగా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైతే ఓటమి వారి ఎదురవుతుందో వారి అహం దెబ్బతింటుంది. ఓటమి వల్ల వారు ఒంటరిగా ఉండిపోతారు.
వృశ్చికరాశి
వృశ్చికరాశి వారికి గెలుపు కోసం తీవ్రంగా కష్టపడతారు. ఓటమి అంటేనే తమపై వ్యక్తిగత దాడిగా భావిస్తారు. ఓటమి వల్ల వీరికి తీవ్రమైన కోపం వస్తుంది. ఓటమికి గల కారణాలపై ప్రతీకారం తీర్చుకోవాలని అంటారు.
మకరరాశి
మకరరాశి వారికి గెలుపు ఒక్కటే ఆశయం. కష్టపడి గెలించేందుకు ప్రయత్నిస్తారు. ఓటమిని తమ వ్యక్తిగత లోపంగా భావిస్తారు. ఓడిపోతే తమను తాము తక్కువగా భావిస్తారు.