- Home
- Astrology
- Zodiac signs: డిసెంబర్ లో ఈ 6 రాశులకు అదృష్టం తలుపులు తెరుచుకున్నట్లే, పట్టిందల్లా బంగారమే
Zodiac signs: డిసెంబర్ లో ఈ 6 రాశులకు అదృష్టం తలుపులు తెరుచుకున్నట్లే, పట్టిందల్లా బంగారమే
Zodiac signs: డిసెంబర్ లో 6 గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల మార్పు 6 రాశుల అదృష్టాన్ని మారుస్తాయి. ఈ సమయంలో ఆ రాశులవారి సంపద పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.

Zodiac signs
జోతిష్య శాస్త్రం ప్రకారం, డిసెంబర్ లో 6 గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకురానున్నాయి. గురు గ్రహం డిసెంబర్ 5న మిథున రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఆ మరుసటి రోజే బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ధనస్సు రాశిలోకి, డిసెంర 16న సూర్యుడు ధనస్సు రాశిలోకి , డిసెంబర్ 20న శుక్రుడు ధనస్సు రాశిలోకి అడుగపెట్టనున్నాడు. ఈ గ్రహాల మార్పులు కొన్ని రాశుల జీవితాల్లోకి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం, విలాసవంతమైన లగ్జరీ లైఫ్ ని పొందే అవకాశం ఉంది. మరి, డిసెంబర్ లో ఏ రాశులవారికి బాగా కలిసి రానుందో ఇప్పుడు చూద్దాం....
మేష రాశి....
మేష రాశివారికి డిసెంబర్ లో గురు గ్రహం బలం చాలా ఎక్కువగా ఉంటుంది. బుధుడు, కుజుడు, సూర్యుడు, శుక్రుడు రాశుల మార్పు కూడా మేష రాశి వారికి డిసెంబర్ లో చాలా శుభ ప్రదంగా మారనుంది. వ్యాపారాల్లో అధిక లాభాలు రానున్నాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారు శుభ వార్తలు వింటారు. వివాహ సమస్యలు తగ్గిపోతాయి. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది.
వృషభ రాశి...
డిసెంబర్ నెల వృషభ రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అసలైన సమయం. పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. కృషికి తగిన ప్రతి ఫలాలను పొందుతారు. మీ చేతులకు ఊహించని వైపు నుంచి డబ్బు వచ్చి చేరుతుంది. ఈ నెలంతా చాలా ప్రశాంతంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆదాయం తో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
సింహరాశి
ఈ నెలలో, గురు, బుధ, కుజుడు, సూర్యుడు, శుక్రుల సంచారము సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పుకు ఇది మంచి సమయం. వ్యాపారవేత్తలకు కూడా ఇది మంచి కాలం. మీరు మీ కృషికి తగిన ఫలాలను పొందుతారు. మీ కెరీర్‌లో అనేక అవకాశాలు పొందుతారు. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీ కెరీర్‌లో కొత్త ప్రాజెక్టులలో మీరు విజయం సాధిస్తారు. మీ కెరీర్ మార్గం సజావుగా ఉండేలా బుధుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, సినిమా పరిశ్రమ, వైద్యం, విద్యా జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది.
వృశ్చికరాశి
ఈ రాశి వారికి గ్రహ స్థానాలు సానుకూలంగా ఉంటాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. పనిలో తదుపరి స్థాయికి వెళ్లి వ్యాపారంలో లాభాలు పొందే యోగం ఉంది. ఈ రాశి వారికి గురు, కుజుడు, సూర్యుడు, శని మంచి స్థానాల్లో ఉన్నందున, పనిలో ఆనందం ఉంటుంది, నెరవేరని కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే, ఆదాయం, గౌరవం పెరుగుతాయి. కుబేరుని అనుగ్రహం వల్ల, కొత్త లాభదాయక అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇప్పటివరకు జరగనివన్నీ ఒక్కొక్కటిగా జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది, పేరు, కీర్తి, వ్యాపారం పెరుగుతుంది.
కన్య రాశి...
డిసెంబర్‌లో, గ్రహాల మార్పులు కన్య రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ నెల మొత్తం వీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి కుదిరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు అన్ని రంగాలలో గొప్ప విజయాన్ని చూస్తారు. కెరీర్, వ్యాపారంలో పురోగతితో పాటు, మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. మీ దీర్ఘకాల కల నెరవేరే అవకాశం ఉంది.
తులారాశి
డిసెంబర్ లో జరిగే గ్రహాల మార్పు తులారాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో, చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు ఈ సమయంలో పూర్తి చేయగలరు. వివాహ సంబంధిత పనులలో మీరు పురోగతిని చూస్తారు. ఈ రాశి వారికి, ఈ సంవత్సరం చివరిలో గురు గ్రహం ప్రత్యక్ష సంచారం మీకు రాజయోగాన్ని ఇస్తుంది. గురు గ్రహం బలం కారణంగా మీరు మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు. గురు గ్రహం పూర్తి అనుగ్రహం మీపై ఉన్నందున మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మొత్తంమీద, ఈ సమయం మీకు ఒక వరంగా మారుతుంది.