Kuja Rahu Conjuction: కుజు రాహు కలయికతో ఈ 3 రాశులకు గుండె, లైంగిక వ్యాధుల ముప్పు
Kuja Rahu Conjuction: కుజు రాహు కలయిక కొన్ని రాశుల వారికి ఏమాత్రం మంచిది కాదు. ఫిబ్రవరి చివరి నాటికి కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించి రాహువుతో కలిసినప్పుడు అంగారక యోగం ఏర్పడుతుంది. ఇది 3 రాశుల వారికి సమస్యలను తెస్తుంది.

అంగారక యోగంతో నష్టం
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన కాదు, ఇది రాశులను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ రాశికి చెందిన వ్యక్తి జీవితం, చుట్టూ ఉన్న పరిస్థితులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. గ్రహాలు సంచార సమయంలో ఒకదానితో ఒకటి కలిసినప్పుడు, వివిధ యోగాలు ఏర్పడతాయి. అలాంటి ఒక యోగమే ఫిబ్రవరి చివరి నాటికి ఏర్పడబోతోంది. దీనిని అంగారక యోగం అంటారు. దీని వల్ల కొన్ని రాశుల వారికి నష్టాలు తప్పకపోవచ్చు. ఫిబ్రవరి చివరి నాటికి కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే రాహువు అక్కడ ఉంటాడు. దీని వల్ల కుజ, రాహువుల కలయిక జరుగుతుంది. ఇది అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ కలయిక ప్రభావం కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
సింహ రాశి
కుజ రాహుల కలయిక సింహ రాశి వారికి అనుకూల మైనది కాదు. ఇది వారి రాశిచక్రంలో ఎనిమిదో ఇంట్లో ఏర్పడుతుంది. ఇది ఆకస్మికంగా వచ్చిపడే సమస్యలను సూచిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు లేదా లైంగిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. వీరికి గాయాలు తగలడం లేదా చిన్న ప్రమాదాలు జరగవచ్చు. కొత్త పనులు ీ సమయంలో మొదలుపెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి.
కన్యా రాశి
కన్యారాశి వారికి రాహు, కుజుల కలయిక వల్ల ఆరోగ్య సమస్యలు, వివాదాలు ఏర్పడవచ్చు. ఈ కలయిక కన్యా రాశి వారి జాతకంలో ఆరవ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది అనారోగ్యం, ఒత్తిడి, శత్రువులకు సంబంధించిన సమస్యలను తెచ్చిపెడుతుంది. కోర్టు, చట్టపరమైన విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.
మీన రాశి
మీన రాశి వారికి అంగారక యోగం మంచిది కాదు. కొంచెం సవాలుతో కూడకున్నది. వీరి రాశిలో పన్నెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిర్యాదులు, వివాదాలు లేదా చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవచ్చు. కుటుంబ విషయాల్లో ముఖ్యంగా తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. పనిలో ఒత్తిడి లేదా అసౌకర్యం అధికంగా ఉంటుంది.

