Zodiac sign: ఈ రాశిలో జన్మించిన వారికి ఎంతో సహనం, వీరున్న ఇంట్లో గొడవలే ఉండవు
Zodiac signs: జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశుల వారికి సహనం అధికంగా ఉంటుంది. ఓపిక కూడా ఎక్కువ. అలాంటి రాశుల వారి ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

సహనంగా ఉండే రాశులు
జ్యోతిష శాస్త్రంలో చెప్పిన ప్రకారం పుట్టిన రాశిని బట్టి ఒక వ్యక్తి స్వభావం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, దక్కే విజయాలపై ప్రభావం పడుతుంది. ప్రతి రాశి చక్రానికి ఒక సహజంగా కొన్ని లక్షణాలు, బలహీనతలు ఉంటాయి. కొన్ని రాశుల్లో పుట్టిన వారికి ఇబ్బందులు, పోరాటాలు, ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉంటే మరికొన్ని రాశుల్లో పుట్టిన వారికి అదృష్టం అధికంగా ఉంటుంది. ఇక ఓర్పు, సహనం ఉండే రాశులు కొన్ని ఉన్నాయి. ఇందులో పుట్టిన వారికి ఎలాంటి సమస్య వచ్చినా, ఎన్ని మాటలన్నా ఓర్పుతో సహనంతో భరిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.
మకర రాశి
మకర రాశిలో పుట్టిన వారికి క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా పోరాడేందుకు మీరు ప్రయత్నిస్తారు. ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఓపికతో భరిస్తారు. కష్ట పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారిని అత్యంత ఓపిక ఉన్న రాశిగా చెప్పుకుంటారు. వీరికి పోరాట బలం ఎక్కువ. విజయం కూడా సులభంగా రాదు, వచ్చిందా అది శాశ్వతంగా ఉండిపోతుంది. మకర రాశి వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరైన నిర్ణయాలే తీసుకుంటారు. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోరు.
కుంభ రాశి
కుంభ రాశి వారిని పాలించేది శని దేవుడు. కానీ వీరుపై రాహు ప్రభావం అధికంగా ఉంటుంది. కుంభ రాశి వారికి సహనం అధికం. కష్ట పరిస్థితుల్లో కూడా మనశాంతిగా ఉండగలరు. వారికి వచ్చే ఆలోచనలో వినూత్నంగా ఉంటాయి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన మార్గాన్ని కనుగొనడంలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీరు ఎలాంటి భావోద్వేగాలకు గురికారు. సమస్య వస్తే జాగ్రత్తగా పరిష్కరించారు. ఇతరుల కష్టాలను కూడా భరించేందుకు సిద్ధపడతారు. ప్రతి సవాలను వీరు అవకాశంగా మార్చుకొని ముందుకు వెళ్లేందుకే ఇష్టపడతారు.
చేయాల్సిన పరిహారాలు
మకర రాశి, కుంభరాశిలో ఉన్నవారికి శని, రాహు కేతువుల ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇందుకోసం చిన్న చిన్న పరిహారాలు చేయాల్సి వస్తుంది. శనివారాల్లో శని దేవుడుని పూజించాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. నల్ల నువ్వులతో దానం చేస్తే మంచిది. అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంత సహనంగా, ఓర్పుగా ఉంటారో వారికి అంత విజయం దక్కుతుంది.

