ఈ రాశి పిల్లలు స్నేహితులతో ఎలా ఉంటారో తెలుసా..?
బాల్యంలో మాత్రం.. ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. ప్రతి ఒక్కరూ స్నేహాన్ని కోరుకుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం... ఏ రాశి పిల్లలు స్నేహితులుగా ఇతరులతో ఎలా ఉంటారో ఓసారి చూద్దాం..

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు చాలా అవసరం. కాస్త పెద్దయ్యాక చాలా తక్కువ మంది మాత్రమే స్నేహితులతో టచ్ లో ఉంటారు. అయితే... బాల్యంలో మాత్రం.. ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. ప్రతి ఒక్కరూ స్నేహాన్ని కోరుకుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం... ఏ రాశి పిల్లలు స్నేహితులుగా ఇతరులతో ఎలా ఉంటారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
మేష రాశి పిల్లలు.. తమ స్నేహితులకు సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళతారు. ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే.. ఈ రాశి పిల్లలు అస్సలు నో చెప్పరు. అయితే.. తమను ఎవరైనా స్నేహితులే మోసం చేయాలని చూస్తే మాత్రం.. అప్పటికప్పుడే వాళ్లతో మాట్లాడి.. ఎందుకు ఇలా చేశారనే క్లారిటీ తీసుకుంటారు.
2.వృషభ రాశి..
ఈ రాశి పిల్లలు.. తమ స్నేహితుల విషయంలో చాలా నిజాయితీతో ఉంటారు. అయితే... వీరు ఎప్పుడూ తమ కంఫర్ట్ జోన్ లో మాత్రమే ఉంటారు. ఎక్కువ మందితో స్నేహం చేయలేరు. చాలా కొద్ది మందితో మాత్రమే స్నేహం చేస్తారు. వారితో.. నిజాయితీగా.. వారితోనే సరదాగా ఉంటారు.
3.మిథున రాశి..
మిథున రాశి పిల్లలు.. తమ స్నేహితులతో చాలా సరదాగా ఉంటారు. తమ కంఫర్ట్ తో ఉన్న వారితో వీరు చాలా ఆనందంగా ఉంటారు. అంతేకాదు.. తమ స్నేహితులు ఏం చెప్పినా వీరు ప్రశాంతంగా వింటారు. అందుకే... వీరు స్నేహితులకు బాగా నచ్చుతారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశి పిల్లలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. తమ స్నేహితులతో చాలా దయగా ఉంటారు. తమ స్నేహితుల సమస్యలను కూడా తమ సమస్యలుగా భావించి.. పెద్ద భారం లాగా వాటిని మోస్తూ ఉంటారు.
5.సింహ రాశి..
ఈ రాశివారు కూడా తమ స్నేహితులతో చాలా దయగా ఉంటారు. స్నేహితులతో పార్టీలు, రాత్రి పార్టీలు చేసుకోవాలని సరదా పడుతూ ఉంటారు. ఎప్పుడూ గెట్ టూ గెదర్ లాంటి వాటిని వెళుతూ ఉంటారు.
6.కన్య రాశి..
కన్య రాశివారు అందరికీ సలహాలు ఇవ్వడంలో ముందుంటారు. తమ స్నేహితుల్లో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. వారు ముందుగా.... కన్య రాశి వారిని మాత్రమే కాంటాక్ట్ అవుతారు. వీరు మంచి సలహాలు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తారు.
7.తుల రాశి..
తుల రాశి వారు కూడా.. ఎవరైనా స్నేహితులు గుంపులు గా మారి గొడవలు పడినప్పుడు.. వారితో మాట్లాడి.. సమస్యను పరిష్కరించేలా చూస్తారు. అందరినీ ప్రశాంతంగా ఉంచేలా వీరు సహకరిస్తారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశి పిల్లలకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. తాము అనుకున్నది తమ స్నేహితుల దగ్గర నుంచి రాబట్టుకోవడానికి వీళ్ల దగ్గర చాలా ఐడియాలు ఉంటాయి. వాళ్లని బ్రతిమిలాడి మరీ.. వారు కోరుకున్నది వీరు సాధిస్తారు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశి పిల్లలు... ఎప్పుడూ తమ చుట్టూ స్నేహితులు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. వీరు చాలా అడ్వెంచర్లు చేయడానికి ఇష్టపడతారు. పార్టీలో వీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉంటారు.
10.మకర రాశి..
మకర రాశి పిల్లలు చాలా నిజాయితీ గా ఉంటారు. స్నేహితులతో చాలా నమ్మకంగా ఉంటారు. స్నేహితులతో కలిసి సరదాగా గడపాలని అనుకుంటారు. వారి స్నేహితులు సమస్యల్లో ఉంటే.. ఆదుకోవడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు.
11.కుంభ రాశి..
ఈ రాశి పిల్లలు చాలా ప్రాక్టీకల్ గా ఉంటారు. అయితే.. వీరు చాలా తెలివిగల వారు. వీరు స్నేహితులకు ప్రతి విషయంలోనూ మద్దతుగా ఉంటారు. స్నేహితులను కాపాడటానికి ఎలాంటి ప్రమాదకర పరిస్థితులనైనా వీరు ఎదుర్కొంటారు.
12.మీన రాశి..
ఈ రాశివారికి స్నేహితులు అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఎప్పటికప్పుడు.. కొత్త కొత్త స్నేహితులను పెంచుకుంటూ ఉంటారు. చాలా అర్థం చేసుకునేలా ఉంటారు. వీరిని ఎవరైనా ఇట్టే ఇష్టపడతారు.