- Home
- Astrology
- Sun Transit: మరో పది రోజుల్లో నక్షత్రం మారనున్న సూర్యుడు.. 4 రాశుల వారికి ఉద్యోగంలో లాభాలు
Sun Transit: మరో పది రోజుల్లో నక్షత్రం మారనున్న సూర్యుడు.. 4 రాశుల వారికి ఉద్యోగంలో లాభాలు
Sun Transit: జూలై 20న ఉదయం 11:30 గంటలకు సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల నాలుగు రాశుల వారికి ఉద్యోగాలలో ప్రత్యేక ప్రయోజనాలు దక్కుతాయి. కొందరికి ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఆ నాలుగు రాశుల వారెవరో తెలుసుకోండి.

మేష రాశి
సూర్య సంచారం వల్ల మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి వీరికి పెద్ద వరమనే చెప్పాలి. ఎంతో కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిపోతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరగవచ్చు. ఒక ప్రముఖ కంపెనీ నుండి కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. పనిచేసే చోట పై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకుంటారు. ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. భవిష్యత్తులో మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
సింహ రాశి
సూర్యుని సంచారం సింహరాశి వారికి ఎంతో శుభ్రమైనది. చేస్తున్న ఉద్యోగంలో వీరికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. పెద్ద ప్రాజెక్టులు చేతికందే అవకాశం ఉంది. వీరికి సమాజంలో మీరు గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్న వారికి ఇదే సరైన సమయం. కోరుకున్న ఉద్యోగం దొరికే సమయం కూడా ఇదే.
వృశ్చిక రాశి
సూర్యుడు పుష్య నక్షత్రంలోకి వెళ్లడం వల్ల వృశ్చిక రాశి వారికి ఉద్యోగం విషయంలో అదృష్టం కలుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. తీసుకున్న రుణాలు కూడా తీరిపోతాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా వీరికి మంచి అద్భుతమైన అవకాశాలు తొక్కుతాయి.

