Zodiac signs: వామ్మో ఈ రాశులను భరించడం చాలా కష్టం.. వీరికి అనుమానం చాలా ఎక్కువ..!
Zodiac signs: మన చుట్టూ అనుమాన పిశాచులు చాలా మంది ఉంటారు. అలాంటివాళ్లు మన జీవితంలో ఉంటే.. వారిని భరించడం చాలా కష్టం. జోతిష్యశాస్త్రంలో కూడా అలాంటి లక్షణాలు ఉన్న రాశులు ఉన్నాయని మీకు తెలుసా?

Zodiac signs
స్వచ్ఛమైన ప్రేమను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి మనల్ని ప్రేమించక పోగా.... ప్రతి విషయంలో అనుమానిస్తారు. ఎవరిని చూసినా, ఎవరితో అయినా మాట్లాడినా.. అనుమానించి ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. తమ జీవిత భాగస్వామికి నరకం చూపిస్తారు. అందుకే వాళ్లను అనుమాన పిశాచులు అంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశుల వారిలో ఇలాంటి లక్షణాలే ఉంటాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
1.మేష రాశి...
మేష రాశి అగ్నికి మారుపేరు. అందుకే... ఈ రాశివారిలోనూ ఆ లక్షణాలు క్లియర్ గా కనపడతాయి. ఈ రాశి వారు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. అంతే ఎక్కువగా అనుమానిస్తారు. తమ జీవిత భాగస్వామిని.. డిటెక్టివ్ లాగా ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటారు. తమ లైఫ్ పార్ట్నర్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు? వారి స్నేహితులు ఎవరు ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలిస్తూనే ఉంటారు. వీరి మితిమీరిన అనుమానంతో.. వారిని నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వీరి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. శాంతి అనేదే ఉండదు.
2.వృషభ రాశి....
వృషభ రాశికి చెందిన వారు జీవితంలో స్థిరత్వం, భద్రతను కోరుకుంటారు. ఈ లక్షణాల కారణంగానే వీరిలో రోజు రోజుకీ అనుమానం పెరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. వారి భాగస్వామి కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ లేదా వారి ప్రవర్తనలో స్వల్ప మార్పు వచ్చినా.. వీరిలో అనుమానం మొదలౌతుంది. వారికి వారే.. మనసులో ఏవేవో ఊహించుకుంటారు. వారు ఆ ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంటారు. అనవసరంగా మానసికంగా కలవరపడతారు. ప్రతిదాన్ని భూతద్దం ద్వారా చూడటం వారి బలహీనత. ఈ ప్రవర్తనతో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ధనుస్సు రాశి...
సాహసం , స్వాతంత్రానికి ప్రసిద్ధి చెందిన ధనుస్సు కూడా అనుమానాస్పదంగా ఉంటుంది. కానీ వారి అనుమానం ఇతరులకన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. వారు తమ భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. తమ భాగస్వామి జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే బలమైన కోరిక వారికి ఉంటుంది. వారు తమ నుండి ఏదో పెద్ద రహస్యాన్ని దాచిపెడుతున్నారనే భావన వారిని నిరంతరం వెంటాడుతుంది. వీరి ప్రవర్తన కారణంగా వీరి నుంచి ఎవరైనా దూరంగా ఉండాలనే అనుకుంటారు. స్వాతంత్రాన్ని కోరుకునే ధనుస్సు రాశి వారు తమ భాగస్వామికి అదే స్వేచ్ఛను ఇవ్వడం మర్చిపోకూడదు.