Astrology: ఈ వారాల్లో హేయిర్ కట్ చేయించుకుంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..!
సాధారణంగా చాలామంది వారాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు హేయిర్ కట్ చేయించుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వారాల్లో జుట్టు అస్సలు కట్ చేయించకూడదట. కట్ చేస్తే ఏమవుతుంది? అసలు ఏ వారం హెయిర్ కట్ చేయించుకోవడం మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా చాలామంది వీలును బట్టి ఏ వారం పడితే ఆ వారం హేయిర్ కట్, షేవింగ్, నేల్స్ కటింగ్ అలా చేయించుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు హేయిర్ కట్ లాంటివి చేయకూడదట. ఆదివారం అయితే అస్సలు చేయకూడదట. ఏ వారాల్లో కటింగ్ చేసుకోకూడదు? చేస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.

జ్యోతిష్యం ప్రకారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం, శనివారం జుట్టు కత్తిరించడం తగ్గించాలి. ఆ రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం అస్సలు మంచిది కాదు. అలా చేస్తే అకాల మరణం సంభవించే అవకాశం ఉందట.

సోమవారం
సోమవారం కూడా జుట్టు కత్తిరించడం మంచిది కాదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఆ రోజు జుట్టు కత్తిరిస్తే పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు.

ఆదివారం
ఆదివారం సెలవు కాబట్టి చాలామంది ఆ రోజు హేయిర్ కట్ చేయించుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజు జుట్టు అస్సలు కత్తిరించుకోకూడదు. ఆదివారం హేయిర్ కట్ చేసుకోవడం వల్ల తెలివితేటలు, సంపద, కీర్తి వారి నుంచి దూరం అయిపోతాయి.

గురువారం
గురువారం కూడా జుట్టు కత్తిరించకూడదు. జ్యోతిష్యం ప్రకారం గురువారం జుట్టు కత్తిరించుకుంటే గౌరవం, ప్రతిష్ట తగ్గుతాయి.

మరి ఎప్పుడు కటింగ్ చేసుకోవచ్చు?
జ్యోతిష్య నిపుణుల ప్రకారం బుధ, శుక్రవారాల్లో జుట్టు, గడ్డం, గోళ్లు కత్తిరించుకోవడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం, కీర్తి, శ్రేయస్సు కలుగుతాయి.