Sun Transit: త్వరలో సూర్యుడి వల్ల ఈ మూడు రాశులకు బీభత్సంగానే కలిసొచ్చే అవకాశం
సూర్యుడిని గ్రహాల రాజుగా చెప్పుకుంటాయి. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే అతనికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సూర్యుడు త్వరలోనే హస్త నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబరులో సూర్య సంచారం
త్వరలో సూర్యుడు హస్త నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి ఈ సూర్య సంచారం శుభప్రదమైన,సానుకూల ఫలితాలను అందిస్తుంది. హస్తా నక్షత్రంలో సూర్యుని ప్రవేశం వల్ల మూడు రాశుల వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది. వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.
మేష రాశి
సూర్యుడు మేష రాశి వారికి అంతా మేలే చేయబోతున్నాడు. సూర్యుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేష రాశిలో పుట్టిన వారికి ఎంతో ఆనంద క్షణాలు వస్తాయి. ఇక పెళ్లికాని వారికి అతి త్వరలో పెళ్లయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పెళ్లి చేసుకున్న వారికి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. సూర్యుని అనుగ్రహంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వృద్ధులు వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. మీరికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
తుల రాశి
తులా రాశి వారికి కూడా సూర్య గోచారం ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. ఇక వైవాహిక జీవితంలో వృద్ధి కనిపిస్తుంది. వారి అనుబంధంలో గొడవలు, ఉద్రిక్తతలు తగ్గుతాయి. వీరు పుణ్య తీర్థాలకు యాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది. వీరి ఆదాయం పెరగవచ్చు. ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా లభిస్తాయి. రిస్క్ తీసుకునేముందు జాగ్రత్త. ఆలోచించి పనిచేయండి.
మీన రాశి
మీన రాశి వారికి మంచి కాలం రాబోతోంది. సూర్యుడు తన ప్రయాణాన్ని హస్త నక్షత్రంలోకి మార్చాక ధనలాభం కలుగుతుంది. ఇక పెళ్లి కాని వారికి మంచి జీవిత భాగస్వామి దొరకవచ్చు. కుటుంబ అనుబంధాలు కూడా బలపడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి విపరీతంగా కలిసి వస్తుంది.