Zodiac signs: వ్యతిరేక దిశలో రాహు-కేతువులు...ప్రతి అడుగులోనూ ఈ రాశులకు విజయమే..!
Zodiac signs: సూర్యుడు, రాహు-కేతువుల మధ్య ఒకే స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా, కొన్ని రాశుల జీవితాలు సూర్యుడిలా ప్రకాశిస్తాయి. అడుగడుగునా వీరికి విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Rahu Ketu Transit
జోతిష్యశాస్త్రం ప్రకారం, రాహు-కేతువులను అత్యంత అశుభ గ్రహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ గ్రహాలను నీడ గ్రహాలు అని కూడా పిలుస్తారు. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం 7వ ఇంట్లో అంటే ఒకదానితో మరొకటి వ్యతిరేక దిశలో సంచరిస్తున్నాయి. కేతువు సింహ రాశిలో సంచరిస్తుండగా, రాహువు సింహ రాశి నుండి 7వ ఇల్లు అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 18న సూర్యుడు ఈ రెండు గ్రహాల మధ్య వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. డిసెంబర్ 18 వరకు సూర్యుడు ఈ స్థితిలోనే ఉంటాడు. ఈ ప్రభావం... 7 రాశులపై చాలా ఎక్కువగా పడనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
వృషభ రాశి...
సూర్యుడు వృషభ రాశిలోని 7వ ఇంట్లో రాహు-కేతువుల మధ్య సంచరిస్తున్నాడు. ఈ స్థానం వృషభ రాశివారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇది అనేక ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలను తెస్తుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఆఫీసులో సహోద్యోగుల మద్దతు కారణంగా కొత్త ప్రాజెక్టులు విజయవంతమౌతాయి. మీరు, మీ ప్రియమైన వారితో ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశి విద్యార్థులు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. అవివాహితులకు పెళ్లి జరిగే అవకాశం ఉంది. వివాహ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మిథున రాశి....
సూర్యుడు మీ జాతకంలో 6వ ఇంట్లో సంచరిస్తున్నాడు. రాహు-కేతువుల మధ్య సూర్య సంచారం మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించగలరు. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. లేకపోతే ప్రమాదం జరగొచ్చు.
కర్కాటక రాశి...
కర్కాటక రాశిలోని 5వ ఇంట్లో సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈరాశివారు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీ జాతకంలో సూర్యడి స్థానం బలంగా ఉంటుంది.ఈ రాశికి చెందిన పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. ఉద్యోగుల ఆదాయం రెట్టింపు చేస్తుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. మీరు మీ పనిలో పూర్తి అవగాహన పొందుతారు. మిమ్మల్ని బాధపెడుతున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
తుల రాశి....
సూర్యుడు రాహువు , కేతువు మధ్య తులారాశి 2వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో, మీరు ఎక్కువ లాభాలను ఆర్జించగలుగుతారు. ధన ప్రవాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. పనికి సంబంధించిన విషయాలలో అదనపు ప్రయత్నాలు రెట్టింపు లాభాలను తెస్తాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శత్రువులు దూరంగా ఉంటారు. మీరు పోటీలలో గెలుస్తారు.
వృశ్చిక రాశి...
సూర్యుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. మీరు కార్యాలయంలో చేసిన ప్రణాళికలు గొప్ప లాభాలను తెస్తాయి. మీరు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని కనుగొంటారు. విద్యార్థులు తమ చదువులపై పూర్తిగా దృష్టి పెడతారు. పుకార్లను నమ్మకపోవడం మంచిది. ఈ కాలం మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కారణంగా ప్రతిదీ శుభప్రదంగా ఉంటుంది.