Zodiac signs: ఈ రాశులకు వారు చాలా డేంజర్, పైకి మంచి వాళ్లలా నటిస్తారు కానీ..
Zodiac signs: ప్రపంచాన్ని భయపెట్టిన హిట్లర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన లాంటి వ్యక్తిత్వం కలిగిన రాశులవారు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

వీళ్లు డేంజర్
జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికీ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని మంచి లక్షణాలు, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. అయితే, కొందరు మాత్రం బయటకు చూడటానికి చాలా మంచి వారిగా నటిస్తారు. వీరికి కొంచెం కూడా సానుభూతి ఉండదు. వీరి ప్రపంచం వారితోనే మొదలై.. వారితోనే ముగుస్తుంది. కాబట్టి, తమను మించి ఎప్పుడూ ఆలోచించరు.
మేష రాశి...
మేష రాశివారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు ప్రసిద్ధి. కానీ వీరిలో స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. వారు తమ లక్ష్యాలకు, తమ కోరికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేష రాశివారు తమ ఆత్మ విశ్వాసాన్ని పాజిటివిటీ కోసం వాడితే… మంచి నాయకులు అవుతారు. కానీ నెగిటివ్ గా వాడితే పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది.
సింహ రాశి
సింహరాశి వారు సహజంగా ఆకర్షణీయంగా, అందరి దృష్టిని ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు. అందరి ప్రశంసలు పొందాలని, నిరంతరం అందరి దృష్టిలో ఉండాలని కోరుకుంటారు. ఇది వారిని స్వార్థపరులుగా, ప్రమాదకరమైన నార్సిసిస్ట్‌లుగా మార్చవచ్చు. కానీ సింహరాశి వారందరూ ఈ ప్రమాదకర ప్రవర్తనను ప్రదర్శించరు. కొందరు మాత్రం తమ ఆకర్షణ, ఆత్మవిశ్వాసంతో ఇతరులను తప్పుదారి పట్టిస్తారు.
మిథున రాశి
మిథునరాశి వారు తమ ద్వంద్వ స్వభావానికి ప్రసిద్ధి. వారిని ఎక్కువగా స్వార్థపరులుగా భావించవచ్చు. వారు పరిస్థితులకు అనుగుణంగా తమ స్వభావాన్ని మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇది అందరూ తమ దారిలోనే నడవాలని కోరుకునేలా చేస్తుంది. ఇది వారిని నార్సిసిస్ట్‌గా చేస్తుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ అందరికంటే గొప్పవారని చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు.
కుంభ రాశి
కుంభరాశి వారిని నార్సిసిస్టిక్ అని పిలిస్తే అస్సలు ఒప్పుకోరు. బదులుగా, తమను తాము స్వతంత్రులుగా చెప్పుకుంటారు. చాలా స్వార్థపరులు, తమ సొంత అవసరాలు, కోరికలు తప్ప మరేదాని గురించి ఆలోచించరు. ఆశయం ఉన్నవారు, దాన్ని సాధించడానికి ఇతరులను వాడుకుంటారు. సింహరాశి వారిలాగే వీరు కూడా ఎక్కువ అటెన్షన్ కోరుకుంటారు, దాని కోసం ఏ స్థాయికైనా వెళ్తారు.