Sun Transit: సూర్యుని సంచారం... నెల రోజులు ఈ రాశులకు కష్టాలే..!
Sun Transit: సూర్య సంచారం 4 రాశుల వారి దురదృష్టం మోసుకురానుంది. 30 రోజుల వరకు ఇబ్బంది కలిగిస్తుంది. నవంబర్ 16 సూర్యుడు కుజ గ్రహం పాలించే వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనప్పుడు, దానిని వృశ్చిక సంక్రాంతి అంటారు.

sun transit
సూర్యుడు అన్ని గ్రహాలకు రాజు. అన్నింటికీ తండ్రి గా పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం, నవంబర్ 16న సూర్యుడు మధ్యాహ్నం 1:45 గంటలకు వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. జోతిష్యుల ప్రకారం, ఈసారి సూర్యుడు కుజుడులోకి ప్రవేశిస్తాడు. అంటే అది నేరుగా కుజ గ్రహంలో చేరుతుంది. దీని ప్రభావం కొన్ని రాశులపై చాలా ఎక్కువగా పడనుంది. మరి, కష్టాలు పడనున్న రాశులేంటో చూద్దాం...
మేష రాశి...
మేష రాశిలో జన్మించిన వారికి ఇది పనిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పై అధికారులతో విభేదాలు లేదా అపార్థాలు ఎదురవ్వచ్చు. అహంకారంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే.. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి...
సూర్య సంచారం కర్కాటక రాశివారికి చాలా ప్రతికూలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మీరు మీ సంబంధాల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీకు దగ్గరగా ఉన్న వారితో విభేదాలు రావచ్చు. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి కలుగుతుంది. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మకూడదు. మోసం చేసే ప్రమాదం ఉంది.
సింహ రాశి...
సూర్య సంచారము సింహరాశి వారికి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలలో కఠినమైన వైఖరి సంఘర్షణకు దారితీస్తుంది. ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతుంది. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్సతాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి.
మీన రాశి...
ఇది జాగ్రత్త వహించాల్సిన సమయం. కోపం పెరగవచ్చు, ఇది సంబంధాలు క్షీణించడానికి దారితీస్తుంది. పనిలో అపార్థాలు ఉండవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, చిన్న ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు. డబ్బు విషయంలో స్నేహితులు లేదా బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.