Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు దేవతతో సమానం, అడుగుపెట్టిన చోట అదృష్టమే
Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అందంగా ఉండటమే కాదు.. వారు తమ భర్తకు ఐశ్వర్యాన్ని మోసుకువచ్చే లక్ష్మీ దేవి స్వరూపాలు.

Birth date
న్యూమరాలజీ అనేది కేవలం సంఖ్యల శాస్త్రమే కాదు, ఇది మన వ్యక్తిత్వం, ఆలోచనలు, అదృష్టాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శాస్త్రం. ప్రతి మనిషి పుట్టిన తేదీ ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కొన్ని తేదీల్లో జన్మించినవారు సహజంగా ఆకర్షణీయంగా, తెలివిగా ఉంటారు. వారు పెళ్లి తర్వాత అత్తవారింటికి అదృష్టాన్ని పెంచుతారు.
నెంబర్ 1( సూర్య కాంతి ఉన్న మహిళలు)
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన మహిళలు సూర్యుని ప్రభావం కలిగి ఉంటారు. సూర్యుడు బలం, ఆత్మవిశ్వాసం, నాయకత్వానికి సంకేతం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా ప్రకాశిస్తారు. వీరి ఉత్సాహం చుట్టుపక్కల వారికి స్ఫూర్తి ఇస్తుంది. వీరిని ఎవరు పెళ్లి చేసుకున్నా... వారి జీవితం కూడా అందంగా మారుతుంది. వీరు అడుగుపెట్టిన తర్వాత భర్త అదృష్టం రెట్టింపు అవుతుంది. వీరి కారణంగా... భర్తకు విజయావకాశాలు కూడా పెరుగుతాయి.
నెంబర్3 (బృహస్పతి ప్రభావం ఉన్న మహిళలు)
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలపై బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహం జ్ఞానం, సానుకూలత, సౌమ్యతకు సంకేతం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా దయతో ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు. అందరినీ ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు. వీరి చిరునవ్వు చుట్టూ ఉన్నవారి మనసును మార్చేస్తుంది. ఇలాంటి మహిళలు జీవితంలోకి వస్తే, ప్రేమ, శాంతి, స్థిరత్వం,అదృష్టం మీ జీవితంలోకి వస్తాయి.
నెంబర్ 6( శుక్ర గ్రహం ఉన్న మహిళలు)
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన మహిళలు అందరూ నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలపై శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. శుక్రుడు ప్రేమ, అందం, కళలకు ప్రతీక. ఈ అమ్మాయిలు సహజంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఫ్యాషన్ గురించి అవగాహన ఉంటుంది. వీరు చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక.. ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే... జీవితం మరింత అందంగా, ఆనందంగా మారుతుంది.