Zodiac signs: మీనరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి కష్ట కాలమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా రాశిలో మూడు గ్రహాలు కలిసినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. త్రిగ్రాహి యోగం ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. ఏప్రిల్ నెలలో మీన రాశిలో సూర్యుడు, శని, శుక్రుడి కలయిక వల్ల కొన్ని రాశుల జీవితాల్లో అనుకోని సమస్యలు వస్తాయట. మరి ఆ రాశులెంటో వారికి ఎలాంటి ఒడిదొడుకులు ఎదురవుతాయో ఇక్కడ చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలియిక, మార్పులు 12 రాశి చక్రాలపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తాయి. సూర్యుడు, శని, శుక్ర గ్రహాల కలయిక ఏప్రిల్ 14 వరకు మీన రాశిలో ఉంటుంది. దీని వల్ల కొన్ని రాశుల జీవితాల్లో సమస్యలు వస్తాయట. ఆ రాశులెంటో ఇప్పుడు చూద్దాం.
సింహ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారిపై త్రిగ్రాహి యోగం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఏప్రిల్ 14 వరకు ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కూడా సమస్యలు వస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి.
తుల రాశి
సూర్యుడు, శని, శుక్రుడి కలియిక ప్రభావం తుల రాశి వారిపై ఉంటుంది. ఈ రాశి వారికి ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.
మీన రాశి
మీన రాశి వారికి త్రిగ్రాహి యోగం సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు ఎంతమాత్రం పనికిరాదు.