MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Dream Meaning: కలలో పాము కనిపించిందా? దాని అర్థమేంటి? శుభమా? ప్రమాదమా?

Dream Meaning: కలలో పాము కనిపించిందా? దాని అర్థమేంటి? శుభమా? ప్రమాదమా?

 Dream Meaning: కలలో మీకు ఎప్పుడైనా పాము కనిపించిందా? కలలో పాము కనిపించడం వెనక ఒక అర్థం ఉంటుందని మీకు తెలుసా? పాము ఎలా కనిపిస్తే మంచిదో మీకు తెలుసా..? 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 04 2026, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Dream
Image Credit : AI

Dream

ప్రతి ఒక్కరికీ రాత్రి నిద్రలో కలలు రావడం చాలా సహజం. కొందరు ఆ కలలను ఉదయం లేచే సరికి మర్చిపోతూ ఉంటారు. కానీ, కొన్ని కలలు ఎంత మర్చిపోదామన్నా అంత తేలికగా మర్చిపోలేం. పదే పదే ఆ కలలు గుర్తుకువస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆ కలలో మనం చూసే దానిపై ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి.. కలలో ఎప్పుడైనా పాము కనిపిస్తే దాని అర్థమేంటి? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అదృష్టం...
Image Credit : Getty

అదృష్టం...

కలలో పాము కనిపించడం అనేది చాలా మందికి ఎదురయ్యే అనుభవం. స్వప్న శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం ప్రకారం దీనికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. అంతేకాదు, పాము మనకు ఎలా కనపడుతుంది అనే విషయం పై దాని అర్థం మారిపోతుంది. అంటే.. పాము కలలో కనిపించి.. మిమ్మల్ని ఏమీ చేయకుండా వెళ్లిపోతే.. అది అదృష్టాన్ని చిహ్నం. త్వరలోనే మీకు ఏదో ఒక రూపంలో అదృష్టం వరించబోతోందని దాని అర్థం. ముఖ్యంగా ధన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

శత్రు భయం..

ఒకవేళ పాము మిమ్మల్ని తరుముతున్నట్లు లేదా కరవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. నిజ జీవితంలో మీకు శత్రువుల నుండి ఇబ్బందులు లేదా ఆందోళనలు ఎదురవ్వబోతున్నాయని అర్థం. లేదంటే.. జోతిష్య శాస్త్రం ప్రకారం..జాతకంలో రాహు లేదా కేతు దోషాలు ఉన్నప్పుడు లేదా కాలసర్ప దోషం ఉన్నప్పుడు పాములు కలలోకి వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే.. ఆ దోష నివారణ చేయించుకుంటే సరిపోతుంది.

33
అభివృద్ధి..
Image Credit : Getty

అభివృద్ధి..

ఇక.. పాము చెట్టు ఎక్కుతున్నట్లు కనిపిస్తే.. మీ వృత్తి లేదా వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని దాని అర్థం.మీరు ఏదైనా విషయం గురించి తీవ్రంగా భయపడుతున్నప్పుడు లేదా.. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా పాము కలలోకి రావచ్చు. అది మీ మనసులోని అణచివేసిన భావానలకు ప్రతిరూపం.

మార్పు (Transformation): పాము తన కుబుసాన్ని విడిచినట్లు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో ఒక పాత దశ ముగిసి కొత్త మార్పు రాబోతోందని దీని అర్థం

ఏ రంగు పాము కనిపిస్తే ఏమవుతుంది?

నల్ల పాము అనారోగ్యం లేదా ఆకస్మిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తెల్ల పాము అత్యంత శుభప్రదం. ఆధ్యాత్మిక ప్రగతి ,అదృష్టం తెస్తుందని అర్థం. బంగారు/పసుపు పాము ధన ప్రాప్తి , సంపద పెరుగుదలను సూచిస్తుంది. ఆకుపచ్చ పాము కొత్త సంబంధాలు లేదా కొత్త వ్యాపారాలు మొదలవ్వడాన్ని సూచిస్తుంది.

పరిహారాలు:ఒకవేళ పాము కలలోకి వచ్చి మీరు భయపడి నిద్రలేస్తే..మరుసటి రోజు పరమశివుడికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం.పాలు, పండ్లు దానం చేయడం."ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Dream Meaning:చనిపోయిన వాళ్లు కలలోకి వచ్చి ఏడుస్తుంటే...దాని అర్థమేంటి?
Recommended image2
Mercury Transit: కర్కాటక రాశిలో బుధ సంచారం...ఈ నాలుగు రాశుల జీవితం అద్భుతంగా మారడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved