దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు ఏర్పడుతున్నాయి. నవంబర్ 8 నుంచి తులా రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది. అలాగే సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య యోగం వస్తోంది. దీని వల్ల 4 రాశుల వారికి కలిసి వస్తుంది.

మేష రాశి
మేష రాశి వారికి దీపావళి చాలా శుభప్రదమైనది. ఈ రాశివారు చేసే పనుల్లో, ఆఫీసులో మంచి సక్సెస్ సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే త్వరగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. పెళ్లి సంబంధాలు కూడా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్థిక సమస్యల నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుంది.
తులా రాశి
తులా రాశి వారికి అదృష్టం బాగా కలిసొచ్చే కాలం ఇది. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ దీపావళికి ఈ రాశి వారి ముఖ్యమైన కల ఒకటి నెరవేరుతుంది. తల్లిదండ్రుల సపోర్ట్ మీకు దొరుకుతుంది. కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. విద్యార్థులకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది.
ధను రాశి
ధనుస్సు రాశి వారికి దీపావళి నుంచి మంచి సమయం ప్రారంభమవుతుంది. మంచి పేరు, సక్సెస్ వస్తుంది. ఆఫీసులో ఈ రాశి వారి పనికి మంచి గుర్తింపు దొరుకుతుంది. వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. దేశ విదేశాల్లో ఈ రాశి వారి పేరు మారుమోగుతుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలనే వీరికి కల నెరవేరుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బిజినెస్ డీల్స్ వల్ల ఫ్యూచర్లో మంచి లాభాలు చూస్తారు.
మీన రాశి
మీన రాశి వారికి ఈ దీపావళి బాగా కలిసివస్తుంది. వీరు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ రాశివారి జీవితంలో పాజిటివ్ మార్పులు చూస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం మరింత పెరుగుతాయి. ఈ రాశివారి కలలు నెరవేరుతాయి, కొత్త లక్ష్యాలను సెట్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేందుకు మంచి అవకాశాలు వస్తాయి.





