శుక్ర గోచారం: కర్కాటక రాశిలోకి శుక్రుడు ఈ ఐదు రాశులకు డబ్బు కొరత తీరినట్లే..!
శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం మంచి స్థితిలో కదిలితే… సంపద పెరుగుతుంది.

శుక్ర గోచారం 2025
వేద జోతిష్య శాస్త్రంలో శుక్రుడు చాలా ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహం మంచి స్థితిలో కదిలితే.. మనుషుల జీవితం మారిపోతుంది.ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఐశ్వర్యం పెరుగుతుంది. ఆగస్టు 20వ తేదీన కర్కాటక రాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశిస్తుంది. ఈ మార్పులు.. ఐదు రాశుల వారికి శుభ ఫలితాలను అందించనున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా…
మేష రాశి...
శుక్ర గోచారం మేష రాశివారికి చాలా మేలు చేయనుంది. మేష రాశి వారికి శుక్ర రాశి మార్పు వల్ల మంచి ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కూడా సాధ్యమే. ఆరోగ్య సమస్యలు తొలగిపోవచ్చు. ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది.
కర్కాటక రాశి...
కర్కాటక రాశిలోనే శుక్రుడు ప్రవేశిస్తాడు, దీని వల్ల వారి అదృష్టం మెరుగవుతుంది. ప్రతి విషయంలోనూ విజయం సాధించగలరు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబంతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
సింహ రాశి..
సింహ రాశి వారికి శుక్ర రాశి మార్పు శుభ ఫలితాలు తెస్తుంది. ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేయగలరు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తీరిపోతాయి. ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బు మళ్లీ మీ చేతికి అందే అవకాశం ఉంది.
తుల రాశి..
శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి అడుగుపెట్టడం తుల రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. తుల రాశి వారికి డబ్బు సమస్యలు తొలగిపోవచ్చు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.
కుంభ రాశి..
శుక్ర గ్రహ సంచారం కుంభ రాశివారికి అనేక ప్రయోజనాలు తీసుకురానుంది. కుంభ రాశి వారికి ఆస్తి లాభం. పూర్వీకుల ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీర్చగలుగుతారు. రాజకీయ నాయకులకు పెద్ద పదవి లభించే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.