Birth Stars: శ్రావణ మాసంలో ఈ 5 నక్షత్రాల వారికి సక్సెస్ పక్కా.. ఇక అన్నీ మంచి రోజులే!
Birth Stars: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శ్రావణ మాసంలో సూర్యుడి అనుగ్రహం, ఇతర గ్రహాల అనుకూల సంచారం వల్ల 5 నక్షత్రాల వారికి అదృష్టం పట్టనుంది. కెరీర్, ఆర్థిక విషయాల్లో తిరుగుండదు. మరి ఆ నక్షత్రాలేవో, వారికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

రోహిణి నక్షత్రం
జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఈ మాసంలో సూర్యుడు, గురుడు, శని, బుధ గ్రహాల అనుకూల సంచారం వల్ల కొన్ని నక్షత్రాల వారికి బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. శ్రావణంలో చంద్రుడి స్థానం అనుకూలంగా ఉండటంతో ఈ నక్షత్రం వారికి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
ఉత్తర ఫల్గుణి నక్షత్రం
ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి అధిపతి సూర్యుడు. అందుకే ఈ శ్రావణ మాసంలో వీరికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలన విభాగాల్లో ఉన్నవారికి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
అనురాధ నక్షత్రం
అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. శని సంచారం ఎప్పుడూ స్థిరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో శని దేవుడి దయతో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, విదేశీ అవకాశాలు కూడా కలిసొస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. ప్రతి పనిలో విజయం దక్కుతుంది.
శ్రవణ నక్షత్రం
శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రం వారికి శ్రావణ మాసంలో గురుడి దృష్టి వల్ల జీవితంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. సొంత వ్యాపారంలో విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో సంతోషం నెలకొంటుంది.
ధనిష్ఠ నక్షత్రం
ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రం వారు శ్రావణ మాసంలో ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు కాస్త శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. శత్రు సమస్యలు తొలగుతాయి. అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు.

