Shani Transit: నక్షత్రం మార్చుకుంటున్న శని, ఈ మూడు రాశులకు అదృష్టయోగం
క్షత్రం మారడం కొన్ని రాశులకు మేలు చేయనుందట.ముఖ్యంగా ఆర్థికంగా ఆ రాశుల సమస్యలన్నీ తరనున్నాయట. మరి, ఆ రాశులేంటో చూద్దామా..

నవ గ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహం శని. అన్ని గ్రహాలలో కెల్లా ఈ గ్రహమే చాలా నెమ్మదిగా కదులుతుంది. శని.. ఒక రాశిలోకి అడుగుపెట్టాడు అంటే.. రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మరో రాశిలోకి అడుగుపెడతాడు.ఇలా రాశి మారినా, నక్షత్రం మారినా.. దాని ప్రభావం అన్ని 12 రాశులపై ఉంటుంది. కాగా, శని గ్రహం.. ఏప్రిల్ 28వ తేదీన నక్షత్రం మార్చుకోనున్నాడు. ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. ఇలా.. నక్షత్రం మారడం కొన్ని రాశులకు మేలు చేయనుందట.ముఖ్యంగా ఆర్థికంగా ఆ రాశుల సమస్యలన్నీ తరనున్నాయట. మరి, ఆ రాశులేంటో చూద్దామా..

telugu astrology
1.మేష రాశి..
శని గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టడం మేష రాశివారికి శుభ ఫలితాలను అందించనుంది. ఈ రాశి వారిరకి మంచి అభివృద్ధి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. అందరిలోనూ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన పిల్లలకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఊహించని శుభవార్తలు వింటారు.

telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశి వారికి శని భగవానుని నక్షత్ర మార్పు మంచి అభివృద్ధిని అందిస్తుంది. కెరీర్‌లో విజయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. సహోద్యోగుల సహాయంతో మీ పని ప్రదేశంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. పదోన్నతి, జీతం పెరిగే అవకాశాలు ఎక్కువ. విద్యార్థులకు ఇది శుభప్రద కాలంగా ఉంటుంది, వారు తమ చదువులో మంచి ఫలితాలను సాధించగలరు. వ్యాపార వర్గాలకు ఇది గొప్ప సమయం, తాము ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. కొత్త అవకాశాలు రావడంతో ఆనందంగా ఉంటారు.

telugu astrology
3.సింహ రాశి..
సింహ రాశి వారికి శని నక్షత్ర మార్పు అపారమైన ఫలితాలను అందిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా స్థిరత ఏర్పడుతుంది, లాభదాయకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లల ప్రగతితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభించడం వల్ల నిర్ణయాలు సులభంగా తీసుకోగలరు. ఈ కాలంలో పెండింగ్‌లో ఉన్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా శారీరకంగా మెరుగుదల కనిపించడంతో పాటు, వివాహ , ప్రేమ జీవితంలో హార్మోనీ నెలకొంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ జ్యోతిష శాస్త్ర పరమైనది మాత్రమే. ఇది ఖచ్చితంగా జరగవలసినదిగా మేము హామీ ఇవ్వలేము. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.

