ఒక్క రోజు ఓపిక పడితే చాలు.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు. శని-సూర్య సంచారంతో
గ్రహాల కదలికలు మన జాతకంపై ప్రభావాన్ని చూపుతాయని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా శని గ్రహ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ మార్పు కొన్ని రోజుల వారికి కలిసిరానుంది. ఇంతకీ ఏంటా మార్పు.? ఏ రాశులకు ఎలాంటి లాభాలు జరగనున్నాయి? తెలుసుకుందాం..

శని–సూర్య సంచారం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 ఆగస్టు 17న సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. మరుసటి రోజే అంటే ఆగస్టు 18న శనిగ్రహం ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి తిరిగి ప్రవేశించి అక్టోబర్ వరకు అదే రాశిలో ప్రయాణించనున్నాడు. అనంతరం పూర్వభాద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. తండ్రి–కొడుకులుగా పరిగణించే ఈ రెండు గ్రహాల స్థానమార్పులు కొన్ని రాశుల వారికి కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు, వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత దక్కే అవకాశం ఉంది.
KNOW
మేష రాశి వారికి శుభ సంకేతాలు
మేష రాశి వారికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు వచ్చి మరింత బలోపేతం చేస్తాయి. ఆదాయం పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉన్నా పనిభారం పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోవడం, వారాంతాల్లో మీకు ఇష్టమైన పనుల్లో సమయం గడపడం మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.
వృషభ రాశి వారికి పెండింగ్ పనుల పరిష్కారం
వృషభ రాశి వారికి సూర్యుడు, శని అనుగ్రహంతో గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం నివారించాలి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారాంతంలో చిన్న చిన్న సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది. శని ఆశీస్సులతో ప్రత్యేక ఫలితాలు లభించే అవకాశం ఉంది.
మకర రాశి వారికి పురోగతి
మకర రాశి వారికి శనిగ్రహం మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో విజయాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. వాహనం, ఆస్తి సుఖాలు పొందవచ్చు. సోదరులు, సోదరీమణుల సహకారం లభించి కుటుంబ సంబంధాలు బలపడతాయి.
ఆధ్యాత్మికంగా శక్తి, కుటుంబంలో ఆనందం
ఈ శని–సూర్య సంచారం కాలంలో మేషం, వృషభం, మకర రాశి వారికి శుభఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, కెరీర్‌లో పురోగతి, కుటుంబంలో సౌఖ్యం లభిస్తాయి. అదే సమయంలో ధ్యానం, ఆధ్యాత్మిక ఆచరణల ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం సానుకూల ఫలితాలను అందిస్తుంది.
గమనిక: ఈ విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో ఉన్న అంశాల ఆధారంగా అందించినవే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.