శని- శుక్ర రాజయోగం.. మూడు రాశులకు అదృష్ట యోగం..!
ప్రస్తుతం శని మీన రాశిలో, శుక్రుడు మిథున రాశిలో ఉన్నారు. ఇందులో ఉంటూనే ఇతర గ్రహాలతో కలిసి కొన్ని యోగాలు ఏర్పరుస్తాయి..

శని-శుక్ర రాజయోగం..
జోతిష్యంలో శనిని న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా గుర్తిస్తారు. జాతకంలో ఈ రెండు గ్రహాల స్థానం వ్యక్తి వృత్తి జీవితంపైనే కాకుండా ఆ వ్యక్తి భౌతిక సుఖాలపై కూడా ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం శని మీన రాశిలో, శుక్రుడు మిథున రాశిలో ఉన్నాయి. ఈ రాశుల్లో ఉంటేనే ఇతర గ్రహాలతో కలిసి యోగాలు ఏర్పరుస్తూ ఉంటాయి. ఆగస్టు 26 ఉదయం 6:23 కి శుక్ర-శని ఒకరికొకరు 120 డిగ్రీల దూరంలో కలుస్తాయి. ఈ యోగం.. కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా…
మేష రాశి
శని-శుక్ర రాజయోగం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. వ్యాపార, ఒప్పందాలు చేసుకునేవారికి ఈ సమయం చాలా శుభప్రదం. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసొస్తాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సమాన మనస్తత్వం ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఈ సమయం ఆరోగ్యం పరంగా సమతుల్యంగా, మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు, ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు.
సింహ రాశి
ఈ శని-శుక్ర రాజయోగం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పరీక్షలు, పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు మాట్లాడేతీరు ఆకట్టుకునేలా ఉంటుంది. మీ కృషి, ప్రయత్నాలు సామాజిక, వృత్తిపరమైన రంగాలలో విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రేమ, వివాహంకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి.
మీన రాశి
ఈ సమయంలో మీన రాశి వారికి వృత్తి, వ్యాపారాలకు సంబంధించి బాగా ప్రయాణించాల్సి రావచ్చు. ఇవన్నీ ఆహ్లాదకరంగా, విజయవంతంగా ఉంటాయి. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా కనిపిస్తాయి. హితుల సహాయంతో జీవితంలో అభివృద్ధి సాధించే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా ఫలవంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం గురించి కొత్త సమాచారం అందుతుంది.