Shani Mahardasha: శని మహర్దశ మొదలైంది..19ఏళ్ల పాటు నాలుగు రాశులకు తిరుగు లేదు..!
జోతిష్యశాస్త్రం ప్రకారం, శని మహర్దశ అంటే శని దేవుడు ప్రభావితం చేసే కాలం. ఇది 19 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి జీవితంపై శని దేవుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

Shani Mahardasha
వేద జోతిష్యశాస్త్రంలో నవగ్రహాలకు సంబంధించి మొత్తం 120 సంవత్సరాల మహాదశల గురించి పేర్కొన్నారు. అంటే ఈ దశలు ప్రతి వ్యక్తిపైనా ప్రభావితం చూపిస్తాయి. అందులో సూర్యుడు( 6 సంవత్సరాలు), చంద్రుడు(10 సంవత్సరాలు), మంగళుడు(7 సంవత్సరాలు), బుధుడు(17 సంవత్సరాలు), గురుడు(16 సంవత్సరాలు), శుక్రుడు (20 సంవత్సరాలు), శని(19 సంవత్సరాలు), రాహు(18 సంవత్సరాలు), కేతు(7 సంవత్సరాలు) మహర్దశ నడుస్తుంది. ప్రస్తుతం మన శని మహర్దశ గురించి మాట్లాడుకుంటున్నాం. శని గ్రహాన్ని మన కర్మలకు ఫలితంగా పరిగణిస్తారు. అంతేకాదు.. న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. ఈ శని దేవుడు మకర రాశి, కుంభ రాశులకు అధిపతి. అలాగే తుల రాశి శనికి చెడు స్థానంలో ఉంటుంది. ఇక, మేష రాశి వారికి నీచ స్థానంగా పరిగణిస్తారు.
శని ప్రభావం..
జోతిష్యశాస్త్రం ప్రకారం, శని మహర్దశ అంటే శని దేవుడు ప్రభావితం చేసే కాలం. ఇది 19 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి జీవితంపై శని దేవుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొంత కాలం కష్టాలు ఎదురైనా.. ఆ తర్వాత శని అనుగ్రహంతో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. న్యాయం, క్రమశిక్షణ, కర్మపరమైన ఫలితాలను బట్టి శనిదేవుని ఆశీర్వాదం లభిస్తుంది. శనిని నిజాయితీగా ఆరాధించిన వారికి ఈ శని మహర్దశ అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది.
శని ప్రభావం ఉంది అని చెప్పగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే.. శని కేవలం మన కర్మ ఫలాన్ని మాత్రమే ఇస్తాడు. మనం తప్పుడు మార్గంలోకి వెళితే.. శిక్షిస్తాడు.కానీ, ఆయనను సద్భావనతో ఆరాధిస్తే, ఆయన చల్లని దృష్టి తో ప్రతి పనిలోనూ విజయం సాధించగలరు. మరి, ఈ శని మహర్దశ ఏయే రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుందో చూద్దాం...
1.కుంభ రాశి...
కుంభ రాశిని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ శని మహార్దాశ కుంభ రాశివారికి అత్యంత శుభకాలం. ఈ సమయంలో కుంభరాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారంలోనూ లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధించగలరు. తద్వారా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అదృష్టం కూడా వీరి వెంటే ఉంటుంది.
2.వృశ్చిక రాశి...
ఇప్పటి వరకు మీరు అనుభవించిన అన్ని కష్టాలు ఈ శని మహర్దశలో తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. మీరు ఆశించిన ప్రభుత్వ ఉద్యోగం సాధించగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. పట్టుకుందల్లా బంగారం అవుతుంది. మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
3.మకర రాశి...
మకర రాశివారికి శని మహర్దశ చాలా బాగా కలిసొస్తుంది. కుటుంబ సంబంధాలు మెరుగు అవుతాయి. వ్యాపారంలో గణనీయమైన లాభాలు పొందుతారు. ఆశించిన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మానసిక ఆనందం, భద్రత,శ్రేయస్సు మీ ఇంట్లో పెరుగుతుంది.
4. కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి శని ప్రభావం చాలా మేలు చేస్తుంది. భవిష్యత్తులో ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. వాహనం కొనుగోలు, విద్యలో విజయాలు, పెట్టుబడులపై లాభాలు ఇలా అన్నీ క్రమంగా సాధ్యపడతాయి. అదృష్టం మీ పక్కన నిలబడుతుంది.
శుభ సూచన: శని అనుగ్రహం పొందాలంటే నిజాయితీ, ధర్మం, సమర్పణతో జీవించాలి. శనివారం శనిదేవుడికి నూనె దీపం వెలిగించడం, హనుమాన్ చాలీసా పఠనం వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలు అందుకుంటారు.
గమనిక: ఈ సమాచారం పురాణాలు, జ్యోతిష్య సిద్ధాంతాల ఆధారంగా ఇచ్చారు. ఇది వైజ్ఞానికంగా నిర్ధారించినది కాదు. వ్యక్తిగత నమ్మకాలను బట్టి ఆచరించగలరు.

