Zodiac signs: మీ రాశి ప్రకారం మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకం. మన వ్యక్తిత్వం, ఆలోచనలు, భావోద్వేగాలకు అనుగుణంగా స్నేహితులను ఎంపిక చేసుకుంటాం.

Zodiac signs
జీవితంలో ప్రతి ఒక్కరూ మంచి స్నేహాన్ని కోరుకుంటారు. అయితే.. అందరికీ అందరితో స్నేహం కుదరదు. చాలా కొద్ది మంది మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశులవారికి చాలా కొద్ది మందితో మాత్రమే స్నేహం కుదురుతుంది. మరి, ఏ రాశివారు ఎవరికి ఎవరు మంచి స్నేహితులు అవ్వగలరో తెలుసుకుందాం...
మేష రాశి..
మేష రాశివారిలో పుట్టుకతోనే సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ రాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరికి సింహ, ధనస్సు రాశివారు ప్రాణ స్నేహితులు అవ్వగలరు. ఈ రెండు రాశులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు కాకుండా.. మేష రాశి వారితో కుంభ, మిథున రాశివారు బాగా కలిసిపోతారు. ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉంటారు. మీ తెలివితేటలను మెచ్చుకుంటారు.
2.వృషభ రాశి...
వృషభ రాశివారికి కన్య, మకర రాశులవారు ప్రాణ స్నేహితులు కాగలరు.ఈ రెండు రాశుల వారు వీరికి నమ్మకమైన స్నేహితులు అవుతారు. వీరి స్నేహం కలకాలం ఉంటుంది. ఒకరితో మరొకరు అన్ని విషయాలను పంచుకుంటారు. వీరి స్నేహం జీవితాంతం ఉంటుంది.
3.మిథున రాశి...
మిథున వారివారు చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు. వ్యక్తి పరిచయం అయిన పది నిమిషాలకే వారిని మంచి స్నేహితులుగా చేసుకోగల సత్తా వీరిలో ఉంటుంది. ఈ రాశివారికి కుంభ రాశి, తుల రాశివారు మంచి స్నేహితులు కాగలరు. ఈ రెండు రాశులతో వారు జీవితానికి సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా పంచుకోగలరు. ఇక మేష, సింహ రాశివారితో కూడా బాగా కలిసిపోతారు.
4.కర్కాటక రాశి...
కర్కాటక రాశివారికి మీన రాశి, వృశ్చిక రాశి వారు పరిచయం అయితే... వారే వీరికి ప్రాణ స్నేహితులు అవుతారు.భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కర్కాటక రాశి వారికి, మీనం, వృశ్చికం వంటి జల రాశులు మంచి మిత్రులు అవుతారు. అలాగే, భద్రతను ఇష్టపడే మీకు వృషభ రాశివారు కూడా మిత్రులు కాగలరు.
5.సింహ రాశి
ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే సింహ రాశి వారికి ధనుస్సు, మేషం వంటి అగ్ని స్వభావం కలిగిన రాశులు, అలాగే సృజనాత్మకత ఎక్కువగా ఉండే.. మిథునం వంటి వాయు స్వభావం కలిగిన రాశుల వ్యక్తులు మంచి స్నేహితులు.
కన్య రాశి..
కన్య రాశివారు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కన్య రాశివారికి వృషభ, మకర రాశివారు మాత్రమే స్నేహితులు కాగలరు.
తులా రాశి
సమతుల్యతను కోరుకునే తులా వారికి మిథునం, కుంభం వంటి వాయు స్వభావం ఉన్న రాశులు మంచి మిత్రులు అవుతారు. సింహ రాశివారు కూడా మంచి స్నేహితులు అవుతారు.
వృశ్చిక రాశి
లోతైన భావోద్వేగాలు కలిగిన వృశ్చికరాశి వారికి జల స్వభావం కలిగిన కర్కాటక, మీన రాశుల వారు మంచి స్నేహితులు అవుతారు. వీరు కాకుండా కేవలం వృషభ రాశివారు మాత్రమే వీరితో స్నేహం చేయగలరు.
ధనుస్సు రాశి
స్వేచ్ఛను ఎక్కువగా కోరుకునే ధనుస్సు వారికి సింహ, మేషం వంటి అగ్ని స్వభావం రాశులు మంచి మిత్రులు అవ్వగలరు. మిథున రాశివారితో కూడా స్నేహం బాగా కుదురుతుంది.
మకర రాశి
కృషికి విలువిచ్చే మకరరాశి వారికి వృషభం, కన్య వంటి భూమి రాశులు మంచి అనుబంధాన్ని ఇస్తారు. భావోద్వేగాలను గౌరవించే వృశ్చికంతో కూడా అనుబంధం బలపడుతుంది.
కుంభ రాశి
విచిత్ర ఆలోచనలతో నడిచే కుంభరాశి వారికి మిథునం, తుల వంటి వాయు స్వభావం కలిగిన రాశులు, అలాగే మేషం వంటి అగ్నిరాశులతో కూడా స్నేహం మెరుగ్గా ఉంటుంది.
మీనం రాశి
సానుభూతి వ్యక్తిత్వం కలిగిన మీనం రాశి వారికి కర్కాటకం, వృశ్చికం వంటి జల స్వభావం ఉన్న రాశులు అత్యుత్తమ మిత్రులు కాగలరు. అలాగే, వృషభం వంటి భూమి రాశులతో కూడా మంచి బంధం ఏర్పడుతుంది.