Shani Gochar: 30ఏళ్ల తర్వాత శని విపరీత రాజయోగం, ఈ రాశులకు డబ్బే డబ్బు
Shani Gochar: శని సంచారం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి లాభం కలుగుతుంది. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల, మీన రాశిలో శనితో విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది.

శని సంచారం..
వేద జోతిష్య శాస్త్రంలో శనిని కర్మ ఫల దాతగా భావిస్తారు. ఈ శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెట్టడానికి 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం మీన రాశిలో ఉంది. కాగా… ఈ గ్రహం. కర్కాటక రాశిలో ఉన్న గురు గ్రహం తో కలిసి విపరీత రాజయోగం ఏర్పరుస్తున్నాడు. దీని కారణంగా, మూడు రాశులకు విపరీతంగా ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా….
వేద జ్యోతిషశాస్త్రంలో శనిని కర్మఫల దాతగా భావిస్తారు. ఒక రాశిలోకి తిరిగి రావడానికి 30 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శని, కర్కాటకంలో ఉన్న గురువుతో విపరీత రాజయోగం ఏర్పరుస్తున్నాడు.
ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి ఈ విపరీత రాజయోగం చాలా మేలు చేస్తుంది. ఈ యోగం కారణంగా.. వీరికి కష్ట సమయాలు రావు. వచ్చినా కూడా వీరు చాలా లాభాలు పొందగలరు. మీ ఆరోగ్యం, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ విపరీత రాజయోగం వల్ల అదృష్టం కలిసివస్తుంది. ప్రతికూల ప్రభావాలు తగ్గి, పెట్టుబడి సమస్యలు తీరతాయి. ఆగిపోయిన ఆస్తి పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం లాభదాయకం. గురు దృష్టి శనిపై ఉండటంతో శుభ ఫలితాలు పెరుగుతాయి. అప్పుల నుంచి విముక్తి, శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి రంగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.