Zodiac sign: 2027 వరకు ఈ రాశులకు తిరుగు ఉండదు, అంతా శని మాయ..!
వైదిక శాస్త్రంలో శని దేవుడి రాశి మార్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది. 2025లో శని వెండి పాదంతో మీన రాశిలోకి ప్రవేశించి 3 రాశుల జీవితాల్లో 2027 వరకు సుఖ సంతోషాలు తెస్తాడు. శని దయతో ఏ రాశుల వాళ్ళు లాభపడతారో తెలుసుకోండి.

శని దేవుడు
జోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ గ్రహాలు తరచూ తమ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మారడం.. కొన్ని రాశులకు మేలు చేస్తే, కొన్ని రాశులకు నష్టాలను కూడా తెస్తాయి. అన్ని గ్రహాల్లో శని గ్రహం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. చాలా స్పెషల్ కూడా. ఈ రాశి తెచ్చే లాభాలు ఎంత సంతోషాన్ని ఇస్తాయో.. ఈ రాశి తెచ్చే కష్టాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. శని కి నాలుగు పాదాలు కూడా ఉంటాయి. శని రాశిని మార్చుకున్నప్పుడు చంద్రుడు రెండో పాదంలో ఉంటాడు.
జాతకుల జీవితంపై ప్రభావం
శని దేవుడి ఈ పాదం లో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు అందుతాయి. వారి అభివృద్ధి కూడా పెరుగుతుంది. అప్పటి వరకు వారు పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఊహించని ధనలాభాన్ని కూడా చూస్తారు. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. 2025 నుంచి 2027 వరకు ఈ ప్రభావం కొనసాగుతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి మేలు జరగనున్నాయట. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...
కర్కాటక రాశి
ఈ రాశి వాళ్ళకి శని దేవుడి వెండి పాదం ఉంటుంది. డబ్బు కొండలా పేరుకుపోతుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. వృత్తి, వ్యాాపారాల్లో బాగా కలిసొస్తుంది. ఇంతకాలంలో ఎప్పుడూ చూడని డబ్బును ఈ రాశివారు ఈ రెండు సంవత్సరాల్లో చూస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వాళ్ళ జీవితంలో మంచి టైమ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. శని దేవుడి దయ ఈ రాశివారిపై బాగా ఉంటుంది. డబ్బు బాగా వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కనక వర్షం కురుస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి.
కుంభ రాశి
జీవితంలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వీరికి కూడా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. జీవితం సంతోషంగా మారుతుంది. శని ఈ రాశి సొంత గ్రహం.. కాగా.. వీరికి అంతా మేలు చేస్తుంది. కుంభ రాశి వాళ్ళకి మంచి టైమ్ స్టార్ట్ అవుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది.