రాశి మారుతున్న శని... ఈ మూడు రాశులకు అదృష్టమే..!
శని గ్రహం తన రాశిని మార్చుకోనుంది. ఫిబ్రవరి 28వ తేదీన కుంభరాశిని వదిలేసి..మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులను అదృష్టం తలుపుతట్టనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలుగా రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని... ఫిబ్రవరి 28వ తేదీన ఆ రాశిని వదిలేసి.. మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు.కాగా.. శని ప్రభావం అన్ని గ్రహాలపై పడుతుంది. కొన్ని రాశులకు అది శుభాన్ని కలిగించగా.. మరి కొన్ని రాశులకు ఇబ్బందిగా మారవచ్చు.
ఎవరి జాతకంలో ఈ శని గ్రహం బలంగా ఉంటుందో వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. వారి జీవితం సౌకర్యాలు, ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది. చెడిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. శని ప్రభావం ఎవరికి శుభప్రదమో తెలుసుకుందాం
కన్య రాశి..
కన్య రాశి వారి జీవితంలో సానుకూల మార్పులుంటాయి. వ్యాపార విస్తరణ, లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
మిథున రాశి..
శని గ్రహం మారడం.. మిథున రాశి వారికి కూడా ప్రయోజనకరం. డబ్బు సమస్యలు తీరతాయి. సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలుంటాయి.
వృశ్చిక రాశి..
శని గమనం వృశ్చిక రాశి వారికి కూడా శుభప్రదం. పెట్టుబడుల్లో లాభాలుంటాయి. సంపద పెరిగే అవకాశం ఉంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. విజయ అవకాశాలు పెరుగుతాయి.