శనిగ్రహం ఎఫెక్ట్.. దేశాధినేతలకు గడ్డుకాలమే ఇక.. ఈ రాశివారికైతే చుక్కలే..
ఏ ఏడాది ఏప్రిల్ 29 తేదీ నుంచి జులై 12 వరకు వివిధ రాశులపై శనిగ్రహం ఎఫెక్ట్ పడనుంది. అంతేకాదు ఈ శనిగ్రహం కారణంగా దేశాదినేతలకు గడ్డుకాలమే అని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు.

Saturn
శుభకృతనామ నామ సంవత్సర రారాజైన శని ఈ ఏడాది ఏప్రిల్ 29 వ తేదీ నుంచి జులై 12 వ తేదీ వరకు 75 రోజుల పాటు తన ప్రభావాన్ని చూపనున్నాడు. శనిగ్రహం ఈ సమయంలో మకర రాశి నుంచి కుంబరాశిలోకి వెళ్లి వెళుతుంది . ఈ శుభక్రుత నామ సంవత్సరంలో 354 రోజులుంటే.. అందులో శనిగ్రహం.. దనిష్టా అనే కుజుని నక్షత్రంలో 347 రోజుల పాటు సంచారం చేస్తుంది. శనికి బద్ద ధత్రువే ధనిష్టా నక్షత్రం. అంటే శని తన శత్రు నక్షత్రంలో సంచరిస్తాడన్న మాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశారిష్టమే అంటున్నారు జ్యోతిష్యులు. కాగా శని అతిచార నడక ఏప్రిల్ 29 తేది ఉదయం 7 గంటల 54 నిమిషాలకు మొదలయ్యింది.
ಕೌತುಕ ವೀಕ್ಷಣೆಗೆ ನೆಹರು ತಾರಾಲಯದಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ
ఇక నెల 30 వ తేది నాడే పాక్షిక సూర్యగ్రహం మేషరాశిలో ఏర్పడింది. అంటే మేషరాశిలోఏర్పడే సూర్యగ్రహనంపై కూడా శని ప్రభావం పడింది. ఇది మే 15 వ తేది రాత్రి నుంచి సంపూర్ణ చంద్రగ్రహనం వృశ్చికరాశి లో ప్రారంభమై తదుపరి రోజు దాక కొనసాగుతుంది. అయితే ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. కేతువు తులారాశిలో ఉంటే వృశ్చికరాశి లో ఎందుకు గ్రహనం ఏర్పడుతుందని. అంటే పది డిగ్రీల కోణంలో చూస్తే .. ఈ గ్రహనం వృశ్చికరాశిలో విశాఖ 4 వ పాదంలో ఏర్పడుతుందన్న మాట.
ఈ గ్రహనం పై కూడా శని చూపు పడుతుంది. అంటే పాక్షిక సూర్యగ్రహనంతో పాటుగా పాక్షిక చంద్రగ్రహనం పై కూడా శని తన ప్రభావాన్ని చూపెడుతాడన్న మాట. కాగా ఈ రెండు గ్రహణాలు మన దేశంలో అస్సలు కనిపించవు. కానీ వివిధ రాశులపై మాత్రం ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దేశారిష్టయోగం అంటున్నారు పండితులు. దీనివల్ల వచ్చే పెద్ద చిక్కేంటంటే.. ఈ శని ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి.
అంతేకాదు.. మే నెల 1 వ తేదీ నుంచి అక్టోబర్ నెల మొత్తం వరకు అంటే మే, జూన్, జులై, అగస్ట్, సెప్టేంబర్, అక్టోబర్ నెలలు.. భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని మరికొన్ని దేశాధినేతలకు ఇది పూర్తిగా గడ్డుకామే అంటున్నారు పలువురు జ్యోతిష్యలు. ముఖ్యంగా ఫిలిపిన్స్, భారత్,ఇండోనేషియా, జపాన్ లో ప్రకృతి వైపరిత్యాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 29 నుంచి మే 18 వ తేదీ వరకు ఇవి సంభవించొచ్చు.
మన దేశంలో ఉత్తర ఈశాన్య భాగము, మధ్య భాగంలోనే కొంతవరకు భూకంప సంభవించొచ్చు. అలాగే తుఫానులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు సలహానిస్తున్నారు. వీటిటి తోడు భారత్, ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తుందట. కానీ మరణాల శాతం మాత్రం ఏమీ ఉండదని చెబుతున్నారు.
ఇక ఈ 75 రోజుల పాటు వివిధ రాశుల వారిపై ఎలా ఉంటుందంటే.. ధనుస్సు రాశి వారికి ఈ 75 రోజుల్లో శని ప్రభావం ఉండదు. ఇక మీన రాశి వారిపై శని 75 రోజుల పాటు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. తులా రాశి విషయానికొస్తే.. అష్టమ శని ప్రభావం వీరిపై పెద్దగా ఉండదు. వృశ్చికరాశి వారిపై ఈ 75 రోజులు కొంచెం ఎఫెక్ట్ ను చూపిస్తుంది. ఇకపోతే మిధున రాశివారిపై అష్టమ శని అంతగా ప్రభావం చూపదు. కర్కాటక రాశి వారి విషయానికొస్తే 75 రోజులు శని లైట్ గా రుచి చూపిస్తాడు.
అయితే ఈ 75 రోజులు అంత మంచి దినాలు లేనందున పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కాస్త ముందు వెనకా చూసి ముందుకెళ్లడం మంచిది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, ఫైనాన్స్ మార్కెట్లు కొన్ని కొన్ని సార్లు కుప్పకూలుతాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం అవసరమని జ్యోతిష్యులు చెబుతున్నారు.