Rahu Transit: శతభిష నక్షత్రంలోకి రాహువు... 9 నెలల పాటు ఈ నాలుగు రాశులకు తిరుగు ఉండదు
Rahu Transit: రాహువు మరి కొద్ది రోజుల్లో శతభిష నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ రాహు సంచారం కొన్ని రాశుల వారికి చాలా మేలు చేయనుంది. ముఖ్యంగా ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. కెరీర్ లో గొప్ప స్థాయికి వెళతారు.

Rahu Transit
జోతిష్య శాస్త్రంలో రాహువును అశుభ గ్రహం గా పరిగణిస్తారు. కానీ, ఈ రాహువు కూడా కొన్ని రాశుల జీవితాలను అద్భుతంగా మార్చనున్నాడు. నవంబర్ 23వ తేదీన ఈ గ్రహం శతభిష నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులకు చాలా ప్రయోజనాలు అందించనుంది. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం....
మేష రాశి.....
రాహు సంచారం మేష రాశివారికి చాలా మేలు చేయనుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కొత్త ప్రాజెక్టులను అమలు చేస్తారు. మీరు ఎందులో పెట్టుబడులు పెట్టినా... లాభాలు పొందుతారు. చేసే ప్రతి పనినీ ఓపికగా , ప్రశాంతంగా చేయడం అలవాటు చేసుకోవాలి. మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. వ్యక్తిగతంగా మంచిగా ఎదుగుతారు.
కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారికి రాహు సంచారం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ, సామాజిక సంబంధాలు బలపడతాయి. మీ జీవితంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండే కార్యకలాపాలలో పాల్గొంటారు. ఈ సమయం మానసిక అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అయితే, మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారు రాహువు సంచారం వల్ల ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక లాభాలు , కెరీర్ పురోగతికి అవకాశాలు తెరుచుకుంటాయి. పాత వివాదాలు, సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెట్టుబడులు, కొత్త వెంచర్లలో ఆలోచనాత్మకంగా వ్యవహరించడం మంచిది. మానసిక బలాన్ని కాపాడుకోవడం, క్రమశిక్షణను పాటించడం ముఖ్యం.
మీనరాశి
మీన రాశి వారికి రాహు సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. పని , వ్యాపారంలో విజయం సాధించగలరు. పెళ్లికాని వారికి వివాహ యోగం ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు పొందేందుకు అనుకూల సమయం. ఏ పని చేసినా ఓపిక పట్టడం వల్ల విజయం సాధిస్తారు.