Kala Sarpa Dosha: రాహు కేతు మార్పులు.. ఈ ఆరు రాశులకు కష్టకాలమే.
రాహు, కేతుల మార్పుల కారణంగా కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ కాలసర్ప దోషం కారణంగా ఆరు రాశులకు సమస్యలు రానున్నాయి.

జోతిష్య శాస్త్రంలో కాలసర్ప దోషానికి, కాల సర్ప యోగానికీ చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దోషం ఉన్నవారు పాము కాటుకు గురయ్యే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. రాహు కేతువులు రాశుల మార్పు కారణంగా ఈ కాల సర్ప దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కన్య రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు ఉన్నాయి. ఈ క్రమంలో కాల సర్ప దోషం ఏర్పడింది. దీని కారణంగా ఆరు రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.మే 11వ తేదీ వరకు ఈ దోషం ఉంటుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..
telugu astrology
మేష రాశి..
6, 12 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం వల్ల కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దీని వల్ల మేష రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు రావచ్చు. లాభం కోసం చాలా కష్టపడాలి. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. పనులు ఆలస్యం అవుతాయి. ఆదాయం తగ్గవచ్చు. బంధువులు, స్నేహితులు దూరం అవుతాయి. ఉద్యోగంలో ప్రాముఖ్యత తగ్గుతుంది.
telugu astrology
మిథున రాశి..
4, 10 స్థానాలు కాలసర్ప దోష ప్రభావానికి గురవుతాయి. ఆదాయం తగ్గి, ఉద్యోగం, వ్యాపారంలో ప్రభావం తగ్గవచ్చు. ఉద్యోగావకాశాలు సరిగ్గా రావు. పై అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందరు. బంధువుల నుంచి విమర్శలు రావచ్చు. ఆస్తి సమస్యలు పెరుగుతాయి. బాకీలు రావు.
telugu astrology
సింహ రాశి..
8వ స్థానంలో ఈ దోషం ఏర్పడటం వల్ల మంచి విషయాలు తక్కువగా జరుగుతాయి. అపార్థాలు ఏర్పడతాయి. ఇవ్వవలసిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడతారు. ఇవ్వవలసిన చోట ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో సమస్యలు వస్తాయి. పోటీదారులు ముందుంటారు. జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం కావు.
telugu astrology
కన్య రాశి
ఆరోగ్యం, ప్రమాదాలు, విమర్శలు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాముఖ్యత తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో నష్టాలు రావచ్చు. డబ్బు సమస్యలు ఇబ్బంది పెడతాయి.
telugu astrology
ధనుస్సు రాశి..
4, 10 స్థానాల్లో దోషం ఉండటం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సంతోషం తగ్గుతుంది. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పై అధికారుల కోపానికి గురి కావచ్చు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శుభవార్తలు రావు.
telugu astrology
మీన రాశి..
రాహువు ఈ రాశిలో సంచరించడం వల్ల కాలసర్ప దోషం ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. వివాహ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. అధికారులతో సమస్యలు వస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఎక్కువ కష్టపడితే తక్కువ లాభం వస్తుంది.