Rahu Mercury Transit: రాహు బుధ కలయికతో ఈ 3 రాశుల వారికి భారీగా కలిసొచ్చే ఛాన్స్
Rahu Mercury Transit: దాదాపు 18 ఏళ్ల తర్వాత రాహువు, బుధుడి కలయిక జరగబోతోంది. అది కూడా కుంభరాశిలో జరిగిపోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ధనలాభంతో పాటు విపరీతమైన పురగోతి కనిపిస్తుంది.

రాహు బుధుల కలయిక
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు, బుధ గ్రహాలు ముఖ్యమైన రాశులు. ఈ రెండు గ్రహాలు చిన్న సంచారం చేసినా కూడా రాశి చక్రాలపై విపరీతమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహాలు రాశిని మార్చినప్పుడు జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత కుంభరాశిలో రాహు బుధుల కలబోతున్నాయి. ఇది రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది మూడు రాశుల వారికి బాగా కలిసొస్తుంది.
మిథున రాశి
రాహు బుధుల కలయిక వల్ల మిథున రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ కాలంలో చేతికి చాలా డబ్బు అందుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం రంగంలో ఉన్నవారికి పెద్ద ఒప్పందాలు జరగవచ్చు. షేర్ మార్కెట్ ద్వారా కూడా విపరీతంగా ధనలాభం పొందుతారు.
కుంభ రాశి
రాహు బుధ కలయిక కుంభరాశిలోనే జరగబోతోంది. దీని వల్ల ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు అందుతాయి. వీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. అప్పుల వాళ్ల దగ్గర నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారం చేస్తున్నవారికి లాభాలు పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మేష రాశి
మేష రాశి వారికి ఈ బుధ రాహు కలయిక అద్భుతమైన సమయం అనే చెప్పాలి. ఈ రాశివారు వ్యాపారంలో విజయం సాధిస్తారు. వీరికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. సమాజంలో గౌరవం రెట్టింపవుతుంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో విజయం దక్కుతుంది.

