MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవాళ్లు చాలా పవర్‌ఫుల్.. ఏ పని చేసినా విజయం వీరిదే!

Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవాళ్లు చాలా పవర్‌ఫుల్.. ఏ పని చేసినా విజయం వీరిదే!

సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా మనలో దాగి ఉన్న బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు అసాధారణమైన ఆలోచనలు, ధైర్యం, పట్టుదలతో జీవితంలో విజయం సాధిస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 30 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ తేదీల్లో పుట్టినవారు పవర్ ఫుల్?
Image Credit : stockPhoto

ఏ తేదీల్లో పుట్టినవారు పవర్ ఫుల్?

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 4. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఈ గ్రహం ప్రభావం వల్ల మూలసంఖ్య 4కి చెందినవారిలో అసాధారణమైన ఆలోచనా విధానం, కష్టాలను ఎదుర్కొనే అద్భుతమైన శక్తి కనిపిస్తాయి. పండితుల ప్రకారం మూలసంఖ్య 4 కలిగిన వ్యక్తులు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగే ధైర్యం కలిగి ఉంటారు. అందుకే వీరు ఏ పని చేపట్టినా చివరికి విజయం సాధించే అవకాశాలు ఎక్కువని పండితులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బలమైన వ్యక్తిత్వం
Image Credit : Getty

బలమైన వ్యక్తిత్వం

అంతేకాదు ఈ సంఖ్యకు చెందినవారి వ్యక్తిత్వం బలంగా ఉంటుంది. వీరు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతరులపై ఆధారపడరు. తమ ఆలోచనల మీదే నమ్మకం ఉంచుతారు. చాలా సందర్భాల్లో వీరి నిర్ణయాలు మొదట ఇతరులకు అర్థం కాకపోవచ్చు. కానీ కాలక్రమేణా అవి సరైనవని అందరికీ తెలుస్తాయి. సంఖ్యా శాస్త్రం ప్రకారం మూలసంఖ్య 4 కలిగినవారు సాధారణ మార్గాలను అనుసరించరు, కొత్త మార్గాలను సృష్టిస్తారు. అందువల్ల వీరు ఎక్కువగా గుర్తింపు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారం, రాజకీయాలు, సాంకేతిక రంగాల్లో వీరు ప్రత్యేక ప్రతిభను కనబరుస్తారు.

Related Articles

Related image1
Shani Mangal Yoga: 5 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి డబ్బుల వర్షమే!
Related image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
35
రాహువు ప్రభావం వల్ల..
Image Credit : Asianet News

రాహువు ప్రభావం వల్ల..

పండితుల ప్రకారం ఈ సంఖ్యకు చెందినవారు క్రమశిక్షణతో జీవించాలి. రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు వీరు ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సహనం పాటించడం అవసరం. అలాగే వీరు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా వీరి ఆలోచనా శక్తి మరింత పదునుగా మారుతుంది.

మూలసంఖ్య 4 కలిగిన వారికి స్నేహం, కుటుంబ బంధాలు ముఖ్యమైనవి. వీరు బయటకు గంభీరంగా కనిపించినా లోపల ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంటారు. తమకు ఇష్టమైన వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచలేక అపార్థాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

45
శుభప్రదమైన తేదీలు
Image Credit : Getty

శుభప్రదమైన తేదీలు

ఆర్థిక విషయాల్లో కూడా ఈ సంఖ్యకు చెందినవారు మంచి ప్రగతిని సాధిస్తారు. ప్రారంభంలో కొంత కష్టపడాల్సి వచ్చినా, దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందుతారు. అయితే వీరు పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పండితుల సూచనల ప్రకారం శుభదినాలను ఎంచుకుని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా 4, 13, 22, 31 తేదీలు వీరికి శుభప్రదం.

55
సవాళ్లతో కూడుకున్న జీవితం
Image Credit : Getty

సవాళ్లతో కూడుకున్న జీవితం

మూలసంఖ్య 4 కలిగినవారు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ అదే సమయంలో ఆ సవాళ్లే వీరిని మరింత బలంగా మారుస్తాయి. సంఖ్యా శాస్త్రం ప్రకారం వీరి జీవితంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ మార్పులు చివరికి వారికి మేలు చేసే విధంగానే ఉంటాయి. ముఖ్యంగా తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని కృషి చేస్తే, వారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image3
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Related Stories
Recommended image1
Shani Mangal Yoga: 5 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి డబ్బుల వర్షమే!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved