MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • 2023లో మీన రాశివారి ఫలితాలు..!

2023లో మీన రాశివారి ఫలితాలు..!

ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం. 

9 Min read
Mahesh Rajamoni
Published : Dec 12 2022, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
Astro

Astro

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

215
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

315
Pisces Zodiac

Pisces Zodiac

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా  శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .    ఓం బృహస్పతయే నమః అని పఠించండి మేలు జరుగుతుంది.
 

415

ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే... 
 
జనవరి 2023
  
ఈ నెలలో  మిశ్రమ ఫలితాలు. ఉద్యోగమునందు అధికారుల యొక్క పని ఒత్తిడి ఎక్కువగా ఉండుట. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ కారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి  అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయం తగ జాగ్రత్తలు తీసుకొని వలెను. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం.  ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.


 లవ్ లైఫ్ :  . దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.  కుటుంబంలో అందరూ అనుకూలం. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి.  

ఉద్యోగం-వ్యాపారం:   న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. 

 ఆరోగ్యం: ఆరోగ్య విషయమై   అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. 
 

515
Pisces Zodiac

Pisces Zodiac

ఫిబ్రవరి 2023

ఈ నెలలో   వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి.  ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన  పనులు ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.  ఈరాశి వారు ఓం కుమారాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి


లవ్ లైఫ్: మీ కుటుంబ సభ్యుల  వివాహయతాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు, పనులు సాగవు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. 
 
ఉద్యోగం-వ్యాపారం:   పెట్టుబడులకు అనుకూలం. ఎగ్రిమెంట్స్  కుదుర్చుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ఆరోగ్యం: మీ   ప్రియతముల ఆరోగ్యం  గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.  వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి.
 

615
Pisces

Pisces

మార్చి 2023

ఈ రాశివారికి ఈ నెల కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.   ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది.పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి.సంఘము నందు వాదోపవాదాలుకుదూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను.  ఓంవీరభద్రాయనమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి


లవ్ లైఫ్ : కుటుంబ సభ్యులతో  ఉత్సాహంగా ఉంటూ, సంతోషంతో పనులు చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువర్గం సహకారం లభిస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
  
ఉద్యోగం-వ్యాపారం:   వ్యాపారం కలిసి వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యవసాయదారులకు దిగుబడి పెరుగుతుంది. 

ఆరోగ్యం: ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. శ్రమ అధికం కావడం వల్ల శారీరకంగా ఇబ్బందులు రావచ్చు. ఓపికతో పనులను పూర్తిచేసుకోవాలి.

715

ఏప్రియల్  2023


ఈ నెలలో ఈ  రాశి వారికి   అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. పనిచేయవారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులను పూర్తి చేయాలి..ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను . ఇంకా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతోటి మనస్పర్ధలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును . ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు యందు జాగ్రత్తవసరం. ఇతరుల యొక్క  విషయాలలో జోక్యం తగదు.  ఈ రాశివారు ఓం అర్కాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి 

 
లవ్ లైఫ్ :   ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఊహించని లాభాలు పొందుతారు.
 
ఉద్యోగం-వ్యాపారం:   ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. రాజకీయ పనులు కలిసివస్తాయి. శ్రమ పెరుగుతుంది. అయితే పట్టుదలతో పనిచేస్తారు. పెద్దల సహకారం అందుతుంది. ఆర్థికస్థితి స్థిరంగా ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. 

ఆరోగ్యం: ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పనుల జోలికి వెళ్లకుండా చేతిలో ఉన్నవాటిని పూర్తి చేసుకోవడం మంచిది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
 

815

మే  2023

ఈ నెలలో యోగకాలం నడుస్తోంది.  విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ఖర్చులు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవును. విందులు  వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా జరుగును .అనవసరమైన ఆలోచనలు తోటి  వృధాగా కాలాన్ని గడపకండి. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి.  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును.  ఇతరులతోటి వాదనలు మానండి.  వాహన ప్రయాణాలు విషయంలో  తగు జాగ్రత్తగా తీసుకొనవలెను. ఈ రాశి వారు ఓం నవదుర్గాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

లవ్ లైఫ్ :  ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

ఉద్యోగం-వ్యాపారం:  వ్యాపార విషయంలో  అనుభవజ్ఞుల సలహా పాటించండి.  రుణయత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మార్పు అనివార్యం. వ్యాపారస్దులు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  సామరస్యంగా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు.  వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

ఆరోగ్యం:    ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.  మాస ద్వితీయార్థంలో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని సమస్యలెదురవుతాయి. దైవ ధ్యానంతో సమస్యలను ఎదర్కోండి. ఆహార,విహార జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని సరిదిద్దుకోండి.

915

జూన్   2023
 
ఈ నెలలో   మానసికంగా బలహీనంగా ఉంటుంది.  ఇతరులతోటి వాదనకు దూరంగా ఉండండి. చేయ పనులు యందు ఆవేశంగా కాకుండా నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్యము నందు జాగ్రత్త వహించాలి.జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.వృత్తి వ్యాపారం నందు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  ఈ రాశి వారు ఓం బృగవే నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

లవ్ లైఫ్ :   దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ కుటుంబంలో ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 

ఉద్యోగం-వ్యాపారం:   ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగులకు అనుకూల కాలం నడుస్తోంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

ఆరోగ్యం: గుండె వ్యాధులు,  మధుమేహం ఉన్నవారికి జాగ్రత్త సూచన.  మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. ఈ  రాశివారికి ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మాసం మద్యలో   గ్రహముల అనుకూల స్థితి వలన సమస్యల నుంచి బయిటపడతారు.  
 

1015

జూలై   2023

ఈ నెలలో    మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో  ఓర్పు, సహనం అవసరం. చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మూతనంగా ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్ధికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అనాలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన మేలు చేస్తుంది.

లవ్ లైఫ్ :  లైఫ్ పార్టనర్ తో ఉత్తేజకరమైన విషయాలు చర్చకు వస్తాయి. కుటుంబ కలహాలకు తావీయకూడదు.  పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది. తోటివారి సహకారంతో ముందుకు సాగండి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మంచిది.

ఉద్యోగం- వ్యాపారం: వ్యాపారస్దులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

 ఆరోగ్యం: ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వైద్య సాయం అవసరం లేకుండా కొన్ని జాగ్రత్తలు, భగవత్ సాయంతో గట్టెక్తుతారు.  గ్రహ దోష నివారణలు పాటిస్తూ ..ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాల్సన అవసరం. 

1115

ఆగస్ట్    2023

 ఈ నెల మీకు పూర్తిగా శుభకాలం. సంతోషకరమైన వార్తలను వింటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. వారి సహకారం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

లవ్ లైఫ్ : జీవన భాగస్వామితో కలిసి  చేసే పనిలో పూర్తి స్పష్టత ఉంటుంది. ప్రేమికులకు కలిసొచ్చే కాలం.  కీలక విషయాల్లో కుటుంబసభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

ఆరోగ్యం: కుటుంబ ఆరోగ్య విషయంలో  మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.  ఓర్పు, సహనం అవసరం.  అనాలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఔషధ సేవ తప్పనిసరి. ఇష్టదేవతా ఆరాధన మేలు చేస్తుంది.

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగ విషమై  కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆఫీస్ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి.  వ్యాపారస్దులకు ప్రయాణ సూచన ఉంది. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

1215

సెప్టెంబర్    2023

  ఈ నెల లో గ్రహ అనుకూలత కనపడటం లేదు. మీరు చేపట్టే  అన్ని పనుల్లో అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మొహమాటంతో లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదవండి.

లవ్ లైఫ్ : కుటుంబ విషయాల్లో చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయొద్దు. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.    

ఉద్యోగం- వ్యాపారం:  వ్యాపారస్దులకు  శుభకాలం నడుస్తోంది. ఉద్యోగస్దులు ఉత్సాహవంతమైన సమయాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది.  ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవ నామాన్ని జపించండి.

ఆరోగ్యం:  ఆరోగ్యం బాగుంటుంది. గ్రహాల సంచారం బాగుండటం వలన కొత్త పరిస్థితులకు తగ్గటుగా కలిసిపోవటంవల్ల ప్రత్యేకంగా  ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్దను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదవే ఉండదు. 

1315

అక్టోబర్    2023

 ఈ మాసం మిశ్రమంగా ఫలితాలు ఉన్నాయి. ఇంటా బయిటా  మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది.

లవ్ లైఫ్ : కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. జీవిత భాగస్వామితో విభేధాలు. దాంతో గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.   అనుకూలత కోసం గ్రహ జపాలు అవసరం.    

ఉద్యోగం- వ్యాపారం:  ఉద్యోగాలలో టార్గెట్ లతో  కొద్దిపాటి విసుగు, చిరాకు తప్పదు. సహోద్యుగలతో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి.  వస్త్ర, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త.   ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్దులు  ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. 

ఆరోగ్యం: , ఆరోగ్య పరంగా పూర్తిగా సమీక్షించుకుంటారు. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి.  అనవసరమైన టెన్షన్, ఒత్తిడి ఆరోగాన్ని ఇబ్బంది పెడుతుంది. 
 

1415

నవంబర్    2023

ఈ నెలలో ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా  వారికీ అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో పూర్తి స్పష్టత ఉంటుంది. కీలక విషయాల్లో కుటుంబసభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

లవ్ లైఫ్ : కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. లైఫ్ పార్టనర్ సాయింతో ఉత్తేజకరంగా ఉంటారు. మీ మాటే నెగ్గాలని ప్రయత్నం చేయకండి.  కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు వల్ల ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. 

ఆరోగ్యం: మీకు ఆరోగ్య పరంగా ప్రత్యేక సమస్య లు ఏమీ లేవు.  సూచనలు లేవు. కానీ  కుటుంబంలోని ఒకరి ఆరోగ్య సమాచారం కంగారుపెడుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుంటాయి. వారి  ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఉద్యోగం- వ్యాపారం :  పనిచేయు చోట శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నూతన వ్యాపారాలకు అనుకూలం. సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సంఘ వ్యవహారాలతో తీరిక ఉండదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.  ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు.ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట అధికం.
 

1515

డిసెంబర్    2023

ఈ నెలలో  శభప్రదంగా సాగుతుంది. ఉత్సాహకరమైన మాసం.    మీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం నడుస్తోంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

లవ్ లైఫ్ :  కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. మీ లైఫ్ పార్టనర్ సహకారం తో అన్ని పనులు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు

ఆరోగ్యం:  కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. ఈ క్రమంలో బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబ వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.  

ఉద్యోగం- వ్యాపారం :  రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి.   ఉద్యోగస్తులకు సంఘ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.  వ్యాపారస్దులు కుదుటపడతారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved