Birth date: ఈ తేదీల్లో పుట్టినవారు సినిమాల్లోకి వెళ్లితే గొప్ప స్టార్స్ అవుతారు..!
మఖ్యంగా సినిమా కెరీర్ ఎంచుకుంటే వారు.. ఆ రంగంలో స్టార్లుగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఉండే స్పెషల్ క్వాలిటీస్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం

న్యూమరాలజీలో ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక శక్తి, ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు మన ఆలోచనా విధానంలోనూ మార్పులు వస్తాయి. కాగా, న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారిలో పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయి. వాటి ప్రకారం కొన్ని స్పెషల్ తేదీల్లో పుట్టిన వారు సినిమా రంగంలోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి కూడా ఎదగగలరు. మరి, ఆ తేదీలేంటో చూసేద్దామా...
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి మంచి భవిష్యత్తు ఉంది. మఖ్యంగా సినిమా కెరీర్ ఎంచుకుంటే వారు.. ఆ రంగంలో స్టార్లుగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఉండే స్పెషల్ క్వాలిటీస్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం
Numerology
సున్నితమైన స్వభావం...
సహజంగా ఈ నాలుగు తేదీల్లోపుట్టిన వారు చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. వీరికి ఓపిక చాలా ఎక్కువ. శాంతంగా ఉంటారు. చంద్రుని ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. దయా గుణం చాలా ఎక్కువ. ఇతరులను ముఖ్యంగా తమ చుట్టు పక్కల ఉండే వారిని అర్థం చేసుకోవడం లో వీరు ముందుంటారు. ఎప్పుడూ వారికి ఎమోషనల్ సపోర్ట్ అందిస్తూ ఉంటారు. కేవలం మాటలతో అండగా ఉండటమే కాదు.. చేతనైన సహాయం కూడా చేస్తూ ఉంటారు.
కెరీర్..
ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు కళలు, రచన, సంగీతం, కౌన్సెలింగ్ వంటి రంగాల్లో మంచి స్థాయికి వెళ్లగలరు. వాళ్ల ఆలోచనలు హృదయాన్ని తాకేలా ఉంటాయి. వారిలో సహజమైన దయ, సంయమనం ఉండటంతో సామాజిక సేవా రంగాల్లోనూ పేరుపొందుతారు. పోటీకి దూరంగా ఉండాలనుకునే వీరు, జట్టు వాతావరణంలో మెరుగుగా పనిచేస్తారు. అవసరమైతే, సున్నితమైన నాయకత్వం ప్రదర్శించగలరు.
సంబంధాల్లో ప్రేమతో, సహనంతో మెలుగుతారు..
సంబంధాల్లో వీరు నిబద్ధత, నమ్మకానికి ప్రాధాన్యం ఇస్తారు. అనురాగంతో, మమకారంతో నడచుకునే ఈ వ్యక్తులు, భాగస్వాములకు ఎంతో విలువనిచ్చే వారు. అయితే, వీరి సున్నిత స్వభావం కొన్నిసార్లు చిన్న విషయాలకు కూడా బాధపడతారు. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే, వీరి సంబంధాలు మరింత బలపడతాయి.
ఆరోగ్యంలో మానసిక సమతుల్యత ముఖ్యం
నెంబర్ 2 వ్యక్తుల ఆరోగ్యం ఎక్కువగా మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. చంద్రుని ప్రభావంతో, వీరికి మూడ్ స్వింగ్స్, ఆందోళన, ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. యోగా, ధ్యానం, నీటితో సంబంధించిన వ్యాయామాలు (ఈత వంటి) వీరికి ఎంతో శ్రేయస్కరం. వీరు శాంతిగా, స్థిరంగా ఉండేందుకు రోజువారీ నియమాలు పాటించడం అవసరం.