MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది.. సంపదకు వీళ్లే చిరునామా!

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తుంది.. సంపదకు వీళ్లే చిరునామా!

డబ్బు కోసం కొందరు జీవితాంతం కష్టపడతారు. మరికొందరిని మాత్రం డబ్బే వెతుక్కుంటూ వస్తుంది. అయితే అది కష్టం, అదృష్టమే కాదు పుట్టిన తేదీ ప్రభావం కూడా అని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు డబ్బు కోసం పరుగులు తీయాల్సిన పనిలేదో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 03 2026, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Date Astrology
Image Credit : stockPhoto

Birth Date Astrology

జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ మన స్వభావాన్ని మాత్రమే కాదు, మనకు డబ్బు ఎలా వస్తుంది, ఎలా నిలుస్తుంది అన్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టినవారు డబ్బు కోసం ఎక్కువగా పరుగెత్తాల్సిన అవసరం ఉండదని, సరైన సమయంలో సరైన అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట తేదీలేంటో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1వ తేదీన పుట్టినవారు
Image Credit : Getty

1వ తేదీన పుట్టినవారు

న్యూమరాలజీ ప్రకారం 1, 5, 6 తేదీల్లో పుట్టినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. 1వ తేదీన పుట్టినవారు సూర్యుడి ప్రభావంతో ఉంటారు. వీరికి నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉండటం వల్ల బిజినెస్, మేనెజ్‌మెంట్, ప్రభుత్వ సంబంధిత రంగాల్లో డబ్బు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వీరు డబ్బు వెనుకపడరు. కానీ వీరి ఆలోచనలు, ఆత్మవిశ్వాసమే డబ్బును ఆకర్షిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Related Articles

Related image1
Gold Astrology: ఈ గ్రహం అనుగ్రహం ఉంటే మీ ఇల్లు బంగారంతో నిండిపోవడం ఖాయం!
Related image2
Zodiac Signs: 4 గ్రహాల సంచారం.. ఈ 4 రాశులవారికి ఇక చుక్కలే! మీ రాశి ఉందా?
35
5వ తేదీన పుట్టినవారు
Image Credit : Getty

5వ తేదీన పుట్టినవారు

ఏ నెలలో అయినా 5వ తేదీన పుట్టినవారు బుధ గ్రహ ప్రభావంతో ఉంటారు. వీరు చాలా చురుకుగా ఉంటారు. తెలివితేటలతో పాటు మంచి మాటతీరు వీరి సొంతం. మార్కెటింగ్, సేల్స్, మీడియా, ట్రేడింగ్ వంటి రంగాల్లో వీరికి అనుకోని లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. జ్యోతిష్య పండితుల ప్రకారం వీరికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు రావడం కంటే, తరచూ అవకాశాలు రావడం విశేషం.

45
6వ తేదీన పుట్టినవారు
Image Credit : Pixabay

6వ తేదీన పుట్టినవారు

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 6వ తేదీన పుట్టినవారు శుక్ర గ్రహ ప్రభావంతో ఉంటారు. వీరు సుఖ సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం వైపు ఆకర్షితులవుతారు. ఫ్యాషన్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఆర్ట్స్ వంటి రంగాల్లో వీరికి అదృష్టం కలిసివస్తుంది. ముఖ్యంగా వీరికి డబ్బును ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసు. సరైన వ్యక్తులు, సరైన సంబంధాలే వీరికి ఆదాయ మార్గాలను పెంచుతాయి.

55
8వ తేదీన పుట్టినవారు
Image Credit : Asianet News

8వ తేదీన పుట్టినవారు

అదే విధంగా ఏ నెలలో అయినా 8వ తేదీన పుట్టినవారు శని ప్రభావంతో ఉంటారు. వీరి జీవితంలో మొదట కష్టాలు, ఆలస్యం ఉన్నా, ఒక దశ తర్వాత డబ్బు స్థిరంగా రావడం మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 8వ తేదీన పుట్టినవారు డబ్బు కోసం ఎక్కువ కష్టపడినా, ఒక్కసారి అదృష్టం కలిసివస్తే మాత్రం సంపద దీర్ఘకాలం నిలుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Gold Astrology: ఈ గ్రహం అనుగ్రహం ఉంటే మీ ఇల్లు బంగారంతో నిండిపోవడం ఖాయం!
Recommended image2
Zodiac Signs: 4 గ్రహాల సంచారం.. ఈ 4 రాశులవారికి ఇక చుక్కలే! మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved