Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారు పక్కన ఉంటే స్వర్గమే..!
న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారు మన లైఫ్ లో ఉంటే... స్వర్గంలో ఉన్నామా అనే భావన కలుగుతుంది. వారిలోని పాజిటివిటీని... మనలోనూ నింపడానికి ప్రయత్నిస్తారు. మరి, అలాంటి వారెవరో చూసేద్దామా...

మన చుట్టూ ఉండేవారి ప్రవర్తన, వ్యక్తిత్వం మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. మన చుట్టూ పాజిటివిటీ నింపే వారు ఉంటే.. మన లైఫ్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని తేదీల్లో పుట్టిన వారు మన లైఫ్ లో ఉంటే... స్వర్గంలో ఉన్నామా అనే భావన కలుగుతుంది. వారిలోని పాజిటివిటీని... మనలోనూ నింపడానికి ప్రయత్నిస్తారు. మరి, అలాంటి వారెవరో చూసేద్దామా...

1.జులై 22..
ఈ తేదీలో పుట్టిన వారు మీ జీవితంలో ఉంటే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందనే చెప్పొచ్చు. నమ్మకం, విధేయత వీరి డీఎన్ఏలో ఉంటుంది. ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం కూడా వీరికి రాదు. మరో యాంగిల్ లో వారిలోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు. తమ జీవితంలో ఉన్నవారి ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకొని విష్ చేయడంలోనూ వీరు ముందుంటారు. సినిమాల్లో హీరో తమ వాళ్ల కోసం పోరాడినట్లు.. ఈ తేదీలో పుట్టిన వారు కూడా తమ వారి కోసం ఎంతకైనా పోరాడతారు. తన జీవితంలో ఉన్నవారందరినీ సంతోషంగా ఉంచుతారు.

ఆగస్టు 17 ...
ఈ తేదీలో పుట్టిన వారు మన జీవితంలో ఉంటే... చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన కష్టం కూడా వాళ్లే పడుతూ.. మనల్ని సంతోషంగా ఉంచడంలో ముందుంటారు. తమ వారి కోసం ఎంతటి కష్టాన్ని అయినా వారే భరిస్తారు. కష్టమంతా వారే పడి... తనను నమ్ముకున్న వాళ్లకు మాత్రం సంతోషాన్ని పంచుతారు.
అక్టోబర్ 2
ఈ తేదీలో పట్టిన వారు కూడా అంటే.. చాలా నమ్మకస్తులు. ఏ సమయంలో అయినా మనకు సహాయం చేయడానికి ముందుంటారు. ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టాలని అనుకోరు. చాలా బాధ్యతగా, లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలంటే... వీరికి మాత్రమే సాధ్యం అని చెప్పొచ్చు.

డిసెంబర్ 15 -
వారు తమ జీవితాన్ని కలిసి గడుపుతారు కానీ ఇతరులను ఎప్పుడూ దాని గురించి చెడుగా భావించేలా చేయరు. కష్టపడి పనిచేసేవారు కానీ పార్టీలలో ఇప్పటికీ సరదాగా ఉంటారు, విజయవంతమవుతారు కానీ దాని గురించి అసహ్యంగా ఉండరు. ఎవరికైనా కెరీర్ సలహా, వ్యాయామ ప్రణాళిక ఇలా ఎలాంటి అవసరం వచ్చినా చిట్కాలు వీరిని అడగాల్సిందే.

