Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి నోరు మూయించలేం..!
న్యూమరాలజీ ప్రకారం.. ఎప్పుడూ లొడలొడ మాట్లాడుతుండే వారు ఏ తేదీల్లో పుట్టారో తెలుసుకుందామా..? ఈ తేదీల్లో పుట్టినవారి నోరు మూయించడం చాలా కష్టం. మరి , ఆ తేదీలేంటో చూద్దాం..

జోతిష్యశాస్త్రం లాగానే.. న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిది? ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు తెలుసుకోవచ్చు.మరి, ఈ న్యూమరాలజీ ప్రకారం.. ఎప్పుడూ లొడలొడ మాట్లాడుతుండే వారు ఏ తేదీల్లో పుట్టారో తెలుసుకుందామా..? ఈ తేదీల్లో పుట్టినవారి నోరు మూయించడం చాలా కష్టం. మరి , ఆ తేదీలేంటో చూద్దాం..
నెంబర్ 3
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు ఒత్తి వాగుడుకాయలు.ఈ తేదీల్లో పుట్టిన వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ. వీరు ప్రతి నిమిషం తమ గురించి పొగడ్తలు చెప్పుకుంటూనే ఉంటారు. వారి గురించి మాత్రమే కాదు.. వారి ఆలోచనల గురించైనా, ఇంకేదైనా విషయం అయినా సరే.. నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉండగలరు.వాళ్లు చెప్పాలి అనుకునే దానిని ఎలాంటి భయం లేకుండా చెప్పగలరు. అంతేకాదు.. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వారి మాటలు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి.తమ మాటలతో ఎవరినైనా ఆకర్షించగల సత్తా వీరిలో ఉంటుంది.వీరిలో సెన్సాఫ్ హ్యూమర్ కూడా చాలా ఎక్కువ. చమత్కారంగా కూడా మాట్లాడగలరు.అందుకే వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉంటారు.
నెంబర్ 5
న్యూమరాలజీ ప్రకారం.. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు కూడా వాగుడుకాయలే. వీరు కూడా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారు.వీరు చాలా ఉత్సాహంగా మాట్లాడగలరు. ఎలాంటి విషయం గురించి అయినా మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తారు. చాలా కంఫర్ట్ గా మాట్లాడగలరు.తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి కూడా తెలియని వాళ్లతో కూడా మాట్లాడతారు. వారు నేర్చుకోవడానికి , వారి ఆవిష్కరణలను ఇతరులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉంటారు.వీరు మాట్లాడే తీరు కూడా అందరికీ నచ్చుతుంది.
నెంబర్ 7
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వ్యక్తులు కూడా చాలా బాగా మాట్లాడగలరు. వీరు కంటిన్యూస్ గా మాట్లాడినా.. పిచ్చి కబుర్లు చెప్పరు. చాలా అర్థవంతమైన సంభాషణలు చేయగలరు. ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు మానవ భావోద్వేగాలను లోతైన అవగాహన కలిగి ఉంటారు. వీరు బాగా మాట్లాడటమే కాదు.. ఇతరులు చెప్పేది కూడా శ్రద్ధగా వినగలరు.