MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం.. కష్టాల నుంచి కోట్లకు పడగెత్తడం ఖాయం..!

Birth date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని ప్రభావం.. కష్టాల నుంచి కోట్లకు పడగెత్తడం ఖాయం..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం ప్రతి తేదీకి కి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన జీవితం ఎలా మారుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి, ఏ తేదీల్లో పుట్టిన వారు శని గ్రహ కష్టాలు అనుభవించి..జీవితంలో కోట్లు గడిస్తారో చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 25 2026, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Birth Date
Image Credit : stockPhoto

Birth Date

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ నెంబర్ 8 కి సంఖ్యా శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, కర్మకు ప్రతి రూపం. ఈ సంఖ్యకు శని దేవుడు అధిపతి. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన వారిని శని పరీక్షిస్తాడు. మొదట ఎన్ని కష్టాలు పెట్టినా.. తర్వాత ఆయన అనుగ్రహంతోనే జీవితంలో కోట్లు సంపాదిస్తారు. మొదట ఎన్ని వైఫల్యాలు ఎదురైనా.. చివరికి విజేతలుగా నిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
శని గ్రహ ప్రభావం... క్రమశిక్షణే వీరి ఆయుధం..
Image Credit : Asianet News

శని గ్రహ ప్రభావం... క్రమశిక్షణే వీరి ఆయుధం..

నెంబర్ 8 కి అధిపతి శని. జోతిష్యశాస్త్రం ప్రకారం శని అంటే చాలా కఠినంగా ఉండే గురువు. అందుకే ఈ సంఖ్యగల వారు విజయం సాధించడానికి ఇతరుల కంంటే రెట్టింపు కష్టపడాలి. వీరి జీవితంలో అదృష్టం కంటే శ్రమకే ఎక్కువ విలువ ఉంటుంది.

కష్టమైన ప్రారంభం.. బలమైన పునాది..

ఈ తేదీల్లో పుట్టిన వారికి చిన్నతనం అంత సవ్యంగా ఏమీ సాగదు. ఎందుకు నా జీవితమే ఇలా ఉంది? ప్రతి చిన్న విషయానికి పోరాడాల్సి వస్తుంది. అయితే, ఈ పోరాటమే వారిని మానసికంగా దృఢంగా మారుస్తుంది. శని దేవుడు ఇచ్చే కష్టాలను వారు ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే.. ఆ పోరాటాలను వీరు మంచి పాఠాలుగా మార్చుకుంటారు. ఆ పాఠాలే.. భవిష్యత్తులో వచ్చే పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తాయి.

33
గంభీరమైన స్వభావం.. నిశ్శబ్ద విజేతలు
Image Credit : Getty

గంభీరమైన స్వభావం.. నిశ్శబ్ద విజేతలు

సంఖ్య 8 వ్యక్తులు సాధారణంగా మితభాషులు. తమ భావోద్వేగాలను త్వరగా బయటపెట్టరు. అవసరానికి మించి మాట్లాడరు. వీరి కుటుంబం, పని పట్ల అత్యంత బాధ్యతగా ఉంటారు. వీరు.. అనవసరపు మాటల కంటే పనిపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే వీరు బయటకు అహంకారులుగా కనిపించినా, లోపల చాలా సున్నితంగా , అంకితభావంతో ఉంటారు.

35 ఏళ్ల తర్వాతే అసలైన 'రాజయోగం'

సంఖ్యాశాస్త్ర నిపుణుల ప్రకారం, 8వ సంఖ్య వారికి 35 నుండి 36 ఏళ్ల వయసులో జీవితంలో అద్భుతమైన మలుపు వస్తుంది. అప్పటివరకు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, సమాజంలో ఉన్నత హోదా లభిస్తుంది. రాజకీయ లేదా వ్యాపార రంగాల్లో వీరు తిరుగులేని నాయకులుగా ఎదుగుతారు.

ప్రభావవంతమైన వ్యక్తులుగా గుర్తింపు

ప్రపంచ ప్రసిద్ధ వ్యాపారవేత్తలు, శక్తివంతమైన నాయకులు చాలామంది ఈ సంఖ్యకు చెందినవారే. ఒకసారి విజయం అందుకుంటే, దానిని నిలబెట్టుకోవడంలో వీరు దిట్ట. వీరి ఓర్పు, సహనమే వీరిని శిఖరాగ్రాన నిలబెడతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిపై గెలవడం అంత ఈజీ కాదు..!
Recommended image2
Birth Date: మీరు ఈ తేదీల్లో పుట్టారా? మీకు డబ్బే డబ్బు.. తిరుగులేని ఫేమ్ మీ సొంతం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved