ఈ రాశివారికి తమ పిల్లలను శిక్షించడం నచ్చదు..!
చాలా మంది పిల్లలను కొట్టడం, దండించడం లాంటివి చేస్తూ కఠినంగా ప్రవర్తిస్తుంటారు. వారు భవిష్యత్తులో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వారు అలా చేస్తుంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల తల్లిదండ్రులు మాత్రం.. తమ పిల్లలను శిక్షించడాన్ని అస్సలు అంగీకరించరట.

parent astro
పిల్లలను పెంచడం అంటే.. వారికి ప్రేమ, సంరక్షణ, అవగాహన, పాంపరింగ్ చేయడం మాత్రమే కాదు.. వారిని క్రమశిక్షణలో పెట్టడం కూడా ముఖ్యమే. పిల్లలను.. అమితంగా ప్రేమించడం.. ఎక్కువగా గారాబం చేయడం వల్ల వారు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో... చాలా మంది పిల్లల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటారు. చాలా మంది పిల్లలను కొట్టడం, దండించడం లాంటివి చేస్తూ కఠినంగా ప్రవర్తిస్తుంటారు. వారు భవిష్యత్తులో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వారు అలా చేస్తుంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల తల్లిదండ్రులు మాత్రం.. తమ పిల్లలను శిక్షించడాన్ని అస్సలు అంగీకరించరట. పిల్లలను శిక్షించకుండా... మంచిగా పెంచాలని అనుకుంటూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
వృషభ రాశి..
ఈ రాశికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమను చాలా ఎక్కువగా అందిస్తారు. వీరికి సహనం చాలా ఎక్కువ. పిల్లల విషయంలో మరింత ఎక్కువ. ఈ రాశివారిని భూమితో పోల్చవచ్చు. వీరు తమ పిల్లలను శిక్షంచడాన్ని ఇష్టపడరు. ఎలాంటి సమస్యనైనా మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉ:టారు. వీరికి కనీసం పిల్లలను మందలించడం కూడా నచ్చదు.
కర్కాటక రాశి..
ఈ రాశివారు పిల్లల విషయంలో చాలా మృదువుగా ఉంటారు. వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. పిల్లల పట్ల ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. వీరికి శిక్షించడం, తిట్టడం లాంటివి అస్సలు నచ్చవు. వీరికి పిల్లలను ప్రేమించడం మాత్రమే తెలుసు.
తుల రాశి..
తుల రాశివారిని శుక్రుడు పాలిస్తూ ఉంటాడు. వీరు న్యాయం కోసం పోరాడుతుంటారు. ఈ రాశివారు కూడా తమ పిల్లలను శిక్షించడాన్ని ఇష్టపడరు. తమ పిల్లలు తప్పు చేశారు అనిపిస్తే.. వారితో శాంతియుతంగా మాట్లాడి.. వారు చేసిన తప్పుని సరిచేసే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప.. పిల్లలను శిక్షించడం వీరికి నచ్చదు.
ధనస్సు రాశి..
ధనుస్సు రాశివారు చాలా స్వేచ్ఛాయుతమైన జీవులు, వారు అన్నింటికంటే తమ స్వేచ్ఛను విలువైనదిగా భావిస్తారు. నియమాలు, నిబంధనలు,శిక్షలు లాంటివి వీరికి నచ్చవు. ధనుస్సు రాశి తల్లిదండ్రులు చాలా తేలికగా ఉంటారు. వారి పిల్లల ప్రవర్తనను సరిచేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తారు. శిక్షించడాన్ని మాత్రం ఒప్పుకోరు.
మీన రాశి..
మీన రాశివారు చాలా దయ, సానుభూతి కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశికి చెందిన తల్లిదండ్రులు ఎక్కువగా శిక్షలు వేయరు.కానీ శాంతియుతంగా ,ప్రేమగా ఉంటారు.