Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు.. డబ్బుకు లోటే ఉండదు!
న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి భవిష్యత్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ప్రవర్తన, వ్యక్తిత్వం, అదృష్టం ఇలా అన్నింటిపై పుట్టిన తేదీ, టైం ప్రభావం చూపిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉండటంతో పాటు అదృష్టవంతులు కూడా. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు లక్కీనో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, టైం చాలా ముఖ్యమైనవి. వీటి ఆధారంగా వ్యక్తి జాతకం, భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. గ్రహాల నక్షత్రాల గమనం తెలుస్తుంది. పుట్టిన తేదీని బట్టి వ్యక్తి ఎలాంటి వారో.. ఎలా ఉంటారో.. చెప్పేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారట. అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుందట. ఆ తేదీలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం ప్రకారం..
సంఖ్యాశాస్త్రం ప్రకారం, 6, 15, 24 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అదృష్టవంతులు కూడా. వీళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరికి డబ్బుకు లోటుండదు. బిందాస్ గా బతికేస్తారు.

శుక్రుడు అధిపతి
ఈ సంఖ్య ఉన్నవాళ్ళకి శుక్రుడు అధిపతి. ఇది అందానికి గుర్తు. అందుకే ఈ రాశి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వీళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఎలాంటి లోటు లేకుండా బతికేస్తారు.

ఎప్పుడూ యవ్వనంగా..
సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ అందం తగ్గిపోతుంటుంది. కానీ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా కనిపిస్తారు.

ప్రశాంతంగా ఉంటారు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. 6 సంఖ్య ఉన్న అమ్మాయిలు నమ్మదగిన వ్యక్తులు. ఇతరులను మోసం చేయడానికి ఎంతమాత్రం ఇష్టపడరు.