MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • న్యూమరాలజీ: డబ్బు విషయంలో ఎవరినీ నమ్మకండి

న్యూమరాలజీ: డబ్బు విషయంలో ఎవరినీ నమ్మకండి

న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి.. ఈ సమయం విజయానికి సూచిక. మీరు ఎంత బిజీగా ఉన్నా.. మీరు ఇంటి పనులకు కూడా సరైన సమయాన్ని ఇస్తారు. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరిస్తారు. ఇంట్లో కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. తప్పుడు చర్యల వల్ల కొంత సమయాన్ని వృధా చేస్తారు. మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 09 2022, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జోతిష్యం ఎలానో.. న్యూమరాలజీ కూడా అంతే. జోతిష్యాన్ని మీ రాశి ప్రకారం చెబితే... న్యూమరాలజీని మీరు పుట్టిన తేదీ ప్రకారం చెప్పవచ్చట. కాగా.. ఈ న్యూమరాలజీని ప్రముఖ నిపుణులు చిరాగ్ దారువాలా మనకు అందిస్తున్నారు. ఆయన ప్రకారం...  డిసెంబర్ 9వ తేదీ న్యూమరాలజీ ప్రకారం మీకు ఈ రోజు ఎలా గడుస్తుందో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Daily Numerology

Daily Numerology

సంఖ్య 1

మీరు ఏదైనా కొత్తది నేర్చుకోవాలని ఆశపడతారు. మనసుకు నచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసికంగా ఆనందంగా ఉంటారు. సంతృప్తిగా ఫీలవుతారు. మీ వ్యాపారాన్ని మరింత వేగంగా, మెరుగ్గా అభివృద్ధి చేయడానికి కావాల్సిన పరపతిని పొందుతారు. అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో ఖర్చుచేయాల్సిన వచ్చినప్పుడు మీ మనస్సు కుదురుగా ఉండదు. అత్తమామలతో సంబంధాలు చెడిపోకుండా కాస్త జాగ్రత్తపడాలి. మీ స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని మోసం చేయొచ్చు. కాబట్టి నమ్మకం లేని వాళ్లకు కొంత దూరంగా ఉండండి. ప్రస్తుతం మీ వ్యాపారం సక్రమంగా కొనసాగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం బాగుంటుంది.
 

310
Daily Numerology

Daily Numerology

సంఖ్య 2

మీ జీవితం బాగుండాలంటే కొన్ని తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. మీ వర్కింగ్ స్టైల్‌లోనూ కొత్తదనం ఉంటుంది. యువకులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన విషయాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించబడతాయి. కమ్యూనికేట్ చేసేటప్పుడు పదాలపై శ్రద్ధ వహించండి. అతిగా మాట్లాడటం వల్ల చిక్కుల్లో పడతారు. సహచరుడు లేదా బంధువు కలత చెందవచ్చు. ప్రయాణంలో కొంత ఇబ్బంది లేదా వేధింపులు ఉండవచ్చు.  వ్యాపారం లేదా ఉద్యోగంలో  లాభదాయకమైన స్థానంలోకి మారుతారు. ఇంటి సభ్యుల మధ్య కొంత విబేధాలు రావొచ్చు.
 

410
Daily Numerology

Daily Numerology

సంఖ్య 3

స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీ జీవనశైలిని మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. సామాజిక రంగంలో మీ ఆధిపత్యం, పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో ప్రయోజనకరమైన పరిచయం ఏర్పడుతుంది. దీని వల్ల మధ్యాహ్న సమయంలో ఎవరితోనైనా వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపార అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త బాధ్యతలను కూడా సరిగ్గా నిర్వహించగలుగుతారు.
 

510
Daily Numerology

Daily Numerology

సంఖ్య 4

మీ పనిపై ఉన్న నమ్మకం మీకు విజయాన్ని ఇస్తుంది. పెట్టుబడి నిర్ణయాలు కూడా సముచితంగా ఉంటాయి. విద్యార్థులు, యువత ఇంటర్వూలు మొదలైన వాటిలో సక్సెస్ అవుతారు..డబ్బు విషయంలో ఎవరినీ నమ్మకండి. చెడు అలవాట్లకు, చెడు సాంగత్యానికి దూరంగా ఉండటం మంచిది. భూమి, ఆస్తి వ్యవహారాలను పరిష్కరించడంలో ఇబ్బందులు  పడతారు. అర్థం లేకుండా ఎవరితోనూ వాదించకండి. సాహిత్యం, కళలకు సంబంధించిన వ్యాపారాలలో మంచి విజయం పొందుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సకాలంలో పరిష్కారమవుతాయి.
 

610
Daily Numerology

Daily Numerology

సంఖ్య 5

డబ్బు విషయంలో తెలివిగా, వివేకంతో నిర్ణయం తీసుకోండి. మీలో ఉన్న బలం, సంకల్ప శక్తితో విజయం సాధిస్తారు. మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటే ఇంటీరియర్ డెకరేటర్ సలహాను తీసుకోండి. కొన్నిసార్లు అనవసర ఖర్చులు చేయడానికి ఇబ్బందిగా ఫీలవుతారు. గృహ-కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ మీరు వాటిని తీర్చగలుగుతారు. పిల్లలకు ఒకరకమైన ఆందోళన ఉంటుంది. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది.
 

710
Daily Numerology

Daily Numerology


సంఖ్య 6

ఈరోజు మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులకైనా పరిష్కారం చేసుకోగలుగుతారు. పరిచయాలు, సంబంధాల సరిహద్దులు కూడా పెరుగుతాయి. విద్యార్థులు చదువులను సీరియస్‌గా తీసుకుంటారు. మతపరమైన కార్యక్రమాలలో కూడా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు ఎక్కువవుతాయి. ఇది మీ బడ్జెట్‌ను మరింత దిగజార్చవచ్చు. పిల్లలు కోరుకున్న విద్యాసంస్థలో చేరుతారు. కానీ సబ్జెక్టుల ఎంపికలో ఇబ్బందులు పడతారు. ఈరోజు ఎంత శ్రమ చేసినప్పటికీ.. సరైన ఫలం లభించదు. ఇబ్బందుల కారణంగా ఇంట్లో కొంత ఉద్రిక్తత ఉంటుంది.
 

810
Daily Numerology

Daily Numerology

సంఖ్య 7

ఈ సమయం మీకు విజయానికి సూచిక. మీరు ఎంత బిజీగా ఉన్నా.. మీరు ఇంటి పనులకు కూడా సరైన సమయాన్ని ఇస్తారు. అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరిస్తారు. ఇంట్లో కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. తప్పుడు చర్యల వల్ల కొంత సమయాన్ని వృధా చేస్తారు. మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే ఇది సంఘర్షణకు దారితీస్తుంది. వ్యాపారం, కార్యకలాపాలలో కొన్ని దృఢమైన, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కుటుంబంతో సరదాగా మంచి పర్యాటక ప్రదేశానికి వెళ్లొచ్చు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.
 

910
Daily Numerology

Daily Numerology

సంఖ్య 8

స్త్రీలు తమ వ్యక్తిత్వాన్ని మంచిగా మార్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. దానిలో విజయం సాధిస్తారు. ఆభరణాలు, బట్టలు వంటి షాపింగ్ కు కూడా వెళ్తారు. ఈ సమయంలో ప్రయాణం చేయకపోవడమే మంచిది. వాహనాలు చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ విషయంలోనూ సోమరితనం, నిర్లక్ష్యం తగదు. ఈ సమయంలో ఫైనాన్స్, భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారం లాభపడుతుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

1010
Daily Numerology

Daily Numerology

సంఖ్య 9

ఈ సమయం మీకు కలిసి వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ సహనం, ఓర్పు ద్వారా మీ ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏదైనా  ప్రారంభించడానికి ముందు ప్రతి పనిని సరిగ్గా తెలుసుకోండి. ఇతరులతో చర్చించండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆస్తి కొనుగోలు, అమ్మకం విషయంలో మీరు మోసపోవచ్చు. ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు చెడు పదాలు ఉపయోగించకండి. కళ, శాస్త్రం, యంత్రానికి సంబంధించిన వ్యాపారాలు విజయవంతమవుతాయి. కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం
జీవనశైలి
 
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి!
Recommended image2
Mars Transit: సింహ రాశిలోకి ప్రవేశించిన కుజుడు.. ఈ 4 రాశులకు శని కేతువుల వల్ల పండగే
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం గ్రహాల సంచారంతో ఏ రాశులవారికి మహర్దశ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved